నివేదన ప్రేమవివాహం.. ఇంటికి వచ్చి చూసే సరికి.. | Father Commits Suicide over Daughters Love Marriage in Chennai | Sakshi
Sakshi News home page

నివేదన ప్రేమవివాహం.. ఇంటికి వచ్చి చూసే సరికి..

Dec 28 2022 7:22 AM | Updated on Dec 28 2022 7:38 AM

Father Commits Suicide over Daughters Love Marriage in Chennai - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, చెన్నై: కూతురు ప్రేమ వివాహం చేసుకుందని సోమవారం తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. పరమత్తివేలూరు తాలూకా పాండమంగళం సమీపంలోని నెట్టైయం పాళయానికి చెందిన వీరప్పన్‌ (55) కూలి. ఇతని భార్య భానుమతి. వీరికి నివేద (22) అనే ఏకైక కుమార్తె ఉంది. ఈమె ఎమ్‌.ఎస్‌.సి చదువుకుని ఇంట్లో ఉంటోంది.

ఈక్రమంలో నివేద అదే ప్రాంతంలోని బెల్లం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సేలం జిల్లా మకుడం చావడికి చెందిన యువరాజ్‌ (25)ను ప్రేమించింది. నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి వారు పెళ్లి చేసుకుని మకుడంచావడిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వీరప్పన్‌ తన కుమార్తె నివేదను భర్తతో కలిసి పట్టణానికి రావాలని ఆహ్వానించాడు. అయితే నివేద రావడానికి నిరాకరించింది. దీంతో వీరప్పన్‌ సోమవారం కుమార్తెను తీసుకురమ్మని భార్య భానుమతిని మకుడం చావడికి పంపాడు.

అయితే నివేద ఇంటికి రావడానికి నిరాకరించిందని, దీంతో చేసేది లేక తిరిగి వస్తున్నానని భానుమతి భర్తకు చెప్పింది. ఇంటికి వచ్చి చూసే సరికి భర్త తాడుతో ఉరివేసుకుని ఉండడంతో వేలూరు పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరప్పన్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.     

Advertisement
 
Advertisement
Advertisement