సెలవు కోసం.. తోటి బాలుడిని చంపేశారు! | 5 Year Old Beaten To Death In Delhi Madrasa By Fellow Students In Hopes Of Holiday, More Details Inside | Sakshi
Sakshi News home page

సెలవు కోసం.. తోటి బాలుడిని చంపేశారు!

Aug 26 2024 4:27 AM | Updated on Aug 26 2024 9:13 AM

5 year old beaten to death in Delhi madrasa by fellow students in hopes of holiday

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. మదర్సాలో చదువుతున్న ఐదేళ్ల బాలుడిని తోటి బాలురే పొట్టనబెట్టుకున్నారు. మదర్సాకు సెలవిస్తే ఇంటికి వెళ్లొచ్చనే దురాచనతో, టీవీలో క్రైం షోలో చూపినట్లే చేశామని నిందితులు తెలపడంతో పోలీసులు విస్తుపోయారు.

శుక్రవారం దయాళ్‌పూర్‌ ఏరియాలోని తలీముల్‌ ఖురాన్‌ మదర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు  దర్యాప్తు చేపట్టిన పోలీసులు 9, 11 ఏళ్ల ముగ్గురు బాలురను విచారించగా దారుణం వెలుగు చూసింది. మదర్సాకు సెలవిస్తారని తోటి బాలుడ్ని కొట్టి చంపినట్లు వాళ్లు ఒప్పుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement