లైంగిక దాడి కేసులో టీడీపీ కార్యకర్త అరెస్టు | - | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి కేసులో టీడీపీ కార్యకర్త అరెస్టు

Sep 20 2023 12:46 PM | Updated on Sep 20 2023 1:23 PM

నిందితుడి అరెస్టు చూపుతున్న సీఐ శ్రీనివాసులు     - Sakshi

నిందితుడి అరెస్టు చూపుతున్న సీఐ శ్రీనివాసులు

మహిళపై లైంగిక దాడి కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు కల్లూరు సీఐ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు.

చిత్తూరు: మహిళపై లైంగిక దాడి కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు కల్లూరు సీఐ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. సీఐ కథనం మేరకు.. సదుం మండలం బ్రాహ్మణవీధికి చెందిన ముస్లిం మహిళ (39) ఆదివారం సాయంత్రం సదుం నుంచి రొంపిచెర్లకు వచ్చి, తిరిగి రాత్రి 7 గంటల స మయంలో ఆటోలో పీలేరుకు బయలుదేరింది. పెద్దగొట్టిగల్లు పంచాయతీ బోనంవారిపల్లెకు చెందిన డ్రైవర్‌ గుర్రప్ప(45) (టీడీపీ కార్యకర్త) ఆటో లో మహిళ ఒక్కటే ఉందని, బండకిందపల్లె–బోనంవారిపల్లెకు మధ్యలో ఉన్న చెరువులోకి ఆటోను వేగంగా తీసుకుని వెళ్లి లైంగిక దాడి చేశాడు.

ఈమేరకు ఆరోజు రాత్రే బాధితురాలు పోలీసులకు ఫిర్యా దు చేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం నిందితుడు గుర్రప్ప బండకిందపల్లె సమీపంలో ఉండగా పోలీసులు అరెస్టు చేసి, ఆటోను సీజ్‌ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా, జడ్జి రిమాండ్‌కు అదేశించినట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement