ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

● ప్రలోభాలకు దిగిన కూటమి నేతలు ● అసంతృప్తులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం – 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

అధికారుల తీరుతో ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆందోళన

పచ్చమూకకు అండగా నిలిచిన పోలీసులు, ఆర్‌ఓలు

ఇప్పటికే నగరంలో హల్‌చల్‌ చేస్తున్న పొరుగు రాష్ట్రాల రౌడీలు

ఆరు హోమ్‌ స్టేల్లో గూండాలకు

బస కల్పించిన టీడీపీ నేతలు

పోలింగ్‌ రోజు మరోసారి దౌర్జన్యాలకు పన్నాగాలు

ఓటుతో బుద్ధి చెప్పేందుకు

సిద్ధమవుతున్న తిరునగరవాసులు

తిరుమలలో నీటి నిల్వల పరిశీలన
తిరుమలలోని డ్యామ్‌లలో నీటి నిల్వలను టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్యచౌదరి పరిశీలించారు.
పకడ్బందీగా కౌంటింగ్‌ ఏర్పాట్లు
కౌంటింగ్‌ సెంటర్లు, స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు.

సాయంత్రం 5గంటలకు గప్‌చుప్‌

శుక్రవారం శ్రీ 30 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. స్వేచ్ఛగా నామినేషన్‌ సైతం వేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండాలు దౌర్జన్యాలకు పాల్పడే దుస్థితి దాపురించింది. పచ్చమూకకు ఎన్నికల అధికారులు.. పోలీసులు సైతం సహకరించడం నియంతృత్వ పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే పోలింగ్‌ రోజైనా ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకునే వాతావరణం కల్పించాల్సిన అవసరముంది. నామినేషన్ల పర్వంలో అక్రమాలకు మసకబారిన తిరుపతి ప్రతిష్టను ఇనుమడింపజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో కలిసి

నిరసన తెలుపుతున్న అభినయ్‌రెడ్డి

రిగ్గింగ్‌ జరగకుండా ఆపండి

అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలను నామినేషన్ల సమయంలో చూశాం. పోలింగ్‌ రోజున రిగ్గింగ్‌ చేసే ఆస్కారం ఉంది. అభ్యర్థులపై దాడులు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్‌ దృష్టి పెట్టి రిగ్గింగ్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలి.

– షాహీన్‌ ఇమ్రాన్‌, కార్పొరేటర్‌ అభ్యర్థి

ప్రజాస్వామ్యాన్ని రక్షించండి

పోలింగ్‌ రోజున ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యా న్ని రక్షించాలి. పోలింగ్‌లో రిగ్గింగ్‌ను అరికట్టాలి. అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు, ఓటర్లకు రక్షణ కల్పించాలి. – గీతాయాదవ్‌, కార్పొరేటర్‌ అభ్యర్ధి

తిరుపతి పవిత్రతను కాపాడాలి

తిరుపతి పవిత్రతను కాపాడాలి. ప్రజాస్వా మ్యాన్ని పరిరక్షించాలి. స్వేచ్ఛాయుత వాతావరణలో ఎన్నికలు జరిగేలా చూడాలి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని ప్రతి ఓటరూ ఎలాంటి భయం లేకుండా తన ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కల్పించాలి.

– ఉమా అజయ్‌, కార్పొరేటర్‌ అభ్యర్ధి

దాడులు జరిగే ప్రమాదం

పోలింగ్‌ రోజున రిగ్గింగ్‌, దాడులు జరిగే ప్రమాదం ఉంది. ముందురోజున పరోక్ష బెదరింపులకు దిగే అవకాశం ఉంది. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి. పోలింగ్‌ ఏజెంట్లు నిర్భయంగా పనిచేసేలా చూడాలి. లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌, సీసీ టీవీ నిఘా పెట్టాలి. – ఎం.సిరాజ్‌, కార్పొరేటర్‌ అభ్యర్ధి

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 74,339 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,836 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.34 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

విద్యార్థినులకు అభినందన

తిరుపతి సిటీ : తిరుపతిలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు చేపట్టిన జూడో పోటీలలో ఎస్పీడబ్ల్యూ విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రతిభ చూపిన విద్యార్థినులు అనిత, లలిత, దీక్షశ్రీకి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ భువనేశ్వరి గురువారం అభినందనలు తెలిపారు. కళాశాలలో అకడమిక్‌ విద్యతో పాటు క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తున్నట్లు తెలిపారు. పీడీ సాయి సుమతిని సైతం ప్రత్యేకంగా అభినందించారు.

నేటి నుంచి పింఛన్ల పంపిణీ

తిరుపతి అర్బన్‌ : పింఛన్‌ డబ్బులతోనే జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలు జిల్లాలో ఉన్నాయి. పింఛన్‌ డబ్బులు ఎప్పుడు వస్తాయా...వైద్య ఖర్చులకు వాడుకుందామని ఎదురుచూస్తుంటాయి. ఈ క్రమంలో శుక్రవారం నుంచి సామాజిక భద్రతా పింఛన్లు పంపిణి చేయాల్సి ఉంది. ప్రతి నెలా డీఆర్‌డీఏ పీడీ నేతృత్వంలో పింఛన్ల పంపిణి ప్రక్రియ నిర్వహిస్తుంటారు. అయితే తిరుపతి డీఆర్‌డీఏ పీడీ శోభనబాబును ఈ నెల 11వ తేదీన జిల్లా పరిషత్‌ సీఈఓగా బదిలీ చేశారు. అలాగే చిత్తూరు జిల్లా మెప్మా పీడీ నాగేశ్వరరావును తిరుపతి డీఆర్‌డీఏ పీడీగా నియమించారు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టేలోపే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో చిత్తూరు మెప్మా పీడీ పోస్టులోనే ఉండిపోయారు. ఎన్నికల కోడ్‌ పూర్తి అయిన తర్వాత అంటే డిసెంబర్‌ 2వ తేదీ తర్వాత తిరుపతికి రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 30వ తేదీ నుంచి సామాజిక భద్రతా పింఛన్ల పంపిణి ప్రక్రియను ఎవరు పర్యవేక్షిస్తారో ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పింఛన్‌దారులకు టెన్షన్‌ తప్పేలా లేదు.

పాఠశాలలకు సెలవు రేపు

తిరుపతి అర్బన్‌ : మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో శనివారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఎన్నికలు జరిగే చోట సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ గురువారం తెలిపారు. తిరుపతి కార్పొరేషన్‌తోపాటు వెంకటగిరి, పుత్తూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట పట్టణాల్లో బడులు ఉండవని వెల్లడించారు. ఎన్నికలు లేని చోట పాఠశాలల్లో తరగతులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

రౌడీ రాజ్యంలో..

నామినేషన్ల నుంచే దౌర్జన్యాలు

తిరుపతి కార్పొరేషన్‌న్‌ ఎన్నికల్లో 66 డివిజన్లలోనూ టీడీపీ శ్రేణులు దౌర్జన్యాలకు తెగబడ్డారు. నామినేషన్ల కౌంటర్ల వద్ద మూడంచెలుగా రౌడీలు, అల్లరిమూకలతో దిగి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేశారు. మరోసారి నామినేషన్‌ కేంద్రాల వద్దకు రావాలంటే భయపడేలా దాడులకు పాల్పడ్డారు. మహిళలని చూడకుండా దుశ్సాసనుల్లా ప్రవర్తించారు. ఈ దారుణాలను అడ్డుకోవాల్సిన ఎన్నికల అధికారులు, పోలీసులు అండగా నిలిచారు. రక్షణ కల్పించాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రాధేయపడినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో నిస్సహయక స్థితిలో సుప్రీం కోర్టు తలుపుతట్టాల్సి వచ్చింది.

సాక్షి, తిరుపతి : ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించే ప్రక్రియ. పోటీ చేయాలనుకుంటే నామినేషన్‌ వేసే హక్కు, నచ్చిన అభ్యర్థిని స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశం ప్రతి ఓటరుకు ఉంటుంది. కానీ, తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల వేళ జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య విలువలకే సవాల్‌గా మారాయి. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగకుండా టీడీపీ నేతలు పక్క రాష్ట్రాల నుంచి తెప్పించిన రౌడీలు, గంజాయి బ్యాచ్‌తో అడ్డంకులు సృష్టించారు. ఆడ, మగ అన్న తేడా లేకుండా భౌతికదాడులకు తెగబడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. పరమ పవిత్రమైన తిరుపతిలో జరిగిన దారుణ దాడులు, రాజకీయ ఒత్తిళ్లపై జాతీయ స్థాయిలో చర్చ జరగింది. చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఎన్నడూ లేనివిధంగా నామినేషన్లకు మరోసారి అవకాశం ఇవ్వాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏస్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ మరోసారి కుట్రలు తెరదీసిందనే వార్తల నేపథ్యంలో ఆదివారం పోలింగ్‌ రోజైనా ఎన్నికల అధికారులు, పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని తిరుపతివాసులు కోరుతున్నారు. దెబ్బతిన్న తిరుపతి ప్రతిష్టను తిరిగి తెచ్చేందుకు ఇదే మంచి అవకాశమని స్పష్టం చేస్తున్నారు.

సుప్రీంకోర్టు జోక్యంతోనే మరో అవకాశం...

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జరిగిన హింస, ప్రతిపక్ష పార్టీల నామినేషన్లను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు.. ఎన్నడూలేనివిధంగా నామినేషన్లకు మరోసారి అవకాశం కల్పించమని ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం తర్జనభర్జన అనంతరం తిరుపతి కార్పొరేషన్‌లో కేవలం 18 డివిజన్లలోనే రీనామినేషన్‌కు అవకాశం కల్పించింది. ఈ పరిణామం ఎన్నికల ప్రక్రియలో తలెత్తిన వివాదానికి ప్రాధాన్యం పెంచింది.

మాయని మచ్చ

ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందిన తిరుపతి రాజకీయంగానూ ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన నగరం. అలాంటి చోట ఎన్నికల వేళ దాడులు, బెదిరింపులు, నామినేషన్ల అడ్డగింత వంటి ఆరోపణలు రావడం నగర ప్రతిష్టపై ప్రభావం చూపిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో తిరుపతి కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సమయంలో జరిగిన దౌర్జన్యకాండను ప్రజలు ఇప్పటికీ మరువలేదు. మళ్లీ కార్పొరేషన్‌ ఎన్నికల నామినేషన్‌ పర్వంలో పాత కథే పునరావృతం కావడంపై ఆందోళన చెందుతున్నారు. ఓటు అనే వజ్రాయుధంతో అఽధికారపార్టీ ఆగడాలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

అధికారులదే బాధ్యత

నామినేషన్ల దశలోనే వివాదాలు చెలరేగిన నేపథ్యంలో పోలింగ్‌ రోజునైనా ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులు కల్పించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత, ఓటర్ల స్వేచ్ఛ, ఎన్నికల అధికారుల నిష్పక్షపాత వైఖరి కీలకం కానున్నాయి. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. కానీ, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం ఉండడమే అసలైన విజయం. తిరుపతిలో ఆ నమ్మకాన్ని నిలబెట్టడం అధికార యంత్రాంగం ముందున్న ప్రధాన బాధ్యత.

పుర ప్రచారం.. నేడు సమాప్తం

నేడే జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం

సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇసో) జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాల సిరీస్‌లో 20వ ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు 19 ప్రయోగాలకు గాను 14 రాకెట్‌లను విజయవంతంగా చేపట్టింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 11.51 గంటలకు నిర్వహించబోయే జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–18 ఈ సిరీస్‌లో 20వ ప్రయోగం. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ కావడంతో శాస్త్రవేత్తల్లో కొంత టెన్షన్‌ ఉంటుంది. ఎందుకంటే 2010 ఏప్రిల్‌ 15వ తేదీన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్‌ దశతో చేసిన జీఎస్‌ఎల్‌వీ డీ3 ప్రయోగం విఫలమైంది. అదే సంవత్సరం డిసెంబర్‌ 25న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–6 ప్రయోగం కూడా విఫలమైంది. ఈ రాకెట్‌ నింగివైపునకు వెళ్లే సమయంలో క్రయోజనిక్‌ దశ కిందభాగంలోని స్టడ్‌ విరిగిపోవడంతో మిషన్‌కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఆకాశంలోనే బ్లాస్ట్‌ చేశారు. తర్వాత 2010 నుంచి 2014 దాకా జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల జోలికే పోలేదు. క్రయోజనిక్‌ ఇంధనం లిక్విడ్‌ అక్సిడైజర్‌, లిక్విడ్‌ హైడ్రోజన్‌ కలిపి తయారు చేయాల్సి ఉండడంతో ఈ టెక్నాలజీని అందుకోవడంలో ఇస్రో శాస్త్రవేత్తలు తొలినాళ్లలో కాస్త తడబడ్డారు. ఈ రెండింటిని మైనస్‌ 220 డిగ్రీల వాతావరణంలో తయారు చేయాల్సి ఉండడంతో సంక్లిష్టమైన టెక్నాలజీగా భావిస్తారు. తర్వాత ఎన్నో రకాలుగా ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించి దాని సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో నిర్దారించుకుని 12 జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు, 9 జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 ప్రయోగాలతో వరుస విజయాలను అందుకున్నారు. ఇందులో 2025 జనవరి 29వ తేదీన చేసిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–15 ప్రయోగం సక్సెస్‌పుల్‌గా నిర్వహించి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి వదిలిపెట్టారు. కక్ష్య మార్పిడి చేసే సమయంలో శాటిలైట్‌ నుంచి సిగ్నల్స్‌ అందకపోవడంతో ఇది విఫల జాబితాలో చేరింది. ఈ సంక్లిష్టమైన టెక్నాలజీని అందుకోవడానికి మొదట ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఇస్రో ఇప్పుడు వరుస విజయాలతో నేడు సగర్వంగా నిలబడింది.

తిరుపతి తుడా: జిల్లా వ్యాప్తంగా తిరుపతి నగరపాలక సంస్థతోపాటు పుత్తూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. అనంతరం ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రచారం చేపట్టకూడదని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ప్రకటించారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ప్రచారాలు, ప్రలోభాలకు దిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పోలింగ్‌ ప్రక్రియ ఆదివారం ప్రారంభం కానుంది. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

రగిలిపోతున్న టీడీపీ సీనియర్లు

ఎన్నికల వేళ కూటమి నేతల్లో తీవ్రమైన అసంతృప్తి తలెత్తింది. ముఖ్యంగా టీడీపీలో వర్గ విభేదాలు తెరపైకి వచ్చాయి. ఆ పార్టీ తిరుపతి ఇన్‌చార్జి పదవిని ఆశించి పలువురు భంగపడ్డారు. నాడు టీడీపీలో ఉన్న ప్రణీత్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మబ్బు దేవనారాయణ రెడ్డి, కోడూరు బాలసుబ్రమణ్యం, ఊకా విజయ్‌కుమార్‌ ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలో తిరుపతి మేయర్‌ ఎన్నికలు వచ్చిపడ్డాయి. కూటమి తరఫున తొలుత మేయర్‌ సీటు జనసేనకి, ఆపై కొన్ని రోజులు బీజేపీకే అంటూ ప్రచారం చేయించారు. ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టక ముందే అనుకున్న ప్రకారం చంద్రబాబు తిరుపతిని టీడీపీకి కేటాయించి బీజేపీ, జనసేనకు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు. జనసేనకే మేయర్‌ అనే ప్రచారం జరగడంతో టీడీపీలో ఉన్న ఊకా విజయ్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. ప్రణీత్‌ హుటాహుటిన వెళ్లి పవన్‌ దగ్గర కండువా కప్పుకున్నారు. చివరిలో తిరుపతి టీడీపీకే అని ప్రకటించారు. ఈ పార్టీలో ఇన్‌చార్జి పదవి బలిజకు వెళ్లడంతో మేయర్‌ సీటు తమకేనని యాదవులు భావించారు. ఆ పార్టీ తిరుపతి ఇన్‌చార్జినే మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీలోని సీనియర్లంతా అవాక్కయ్యారు. ముఖ్యంగా అన్నా అనిత యాదవ్‌, దంపూరి భాస్కర్‌ యాదవ్‌, డాక్టర్‌ గుణశేఖర్‌ యాదవ్‌ మేయర్‌ సీటు కోసం విశ్వ ప్రయత్నం చేసి చివరికి చతికిల పడ్డారు. పదవులు అన్నీ ఒక వర్గానికై నా.. అంటూ పలువురు సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ తరుణంలోనే జనసేనలోని అసంతృప్తి నేతలను ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ మేయర్‌ అభ్యర్థి జేబీ శ్రీనివాస్‌, ఆయన వర్గం ప్రలోభాలకు దిగారు. ఈ క్రమంలో కుల సమీకరణాలకు పాల్పడుతున్నారు. ఇతర పార్టీ అభ్యర్థులు, నేతలను, రెబల్స్‌ను దారికి తెచ్చుకునే పనిలో నిమగ్నమై మంతనాలు ప్రారంభించారు.

జిల్లాలోని పురపాలక సమాచారం

తిరుపతి సిటీ : ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ జనరల్‌, ఒకేషనల్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ పొడిగించింది. గురువారంతో ముగిసిన గడువును మళ్లీ అధికారులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్‌ 10వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ.1000 అపరాధ రుసుముతో నవంబర్‌ 17వ తేదీని తుదిగడువుగా నిర్ణయించారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల వేళ అప్రజాస్వామిక పోకడలు

తిష్టవేసిన గూండాలు

కార్పొరేషన్‌ ఎన్నికల నామినేషన్ల పర్వంలో ప్రతిపక్షపార్టీలను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు తమిళనాడు, కర్ణాటక నుంచి సుమారు 2 వేల మంది రౌడీలను నగరానికి రప్పించిన విషయం తెలిసిందే. మున్సిపల్‌ నామినేషన్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ గూండాలను చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో వాడుకున్నారు. గంజాయి మత్తులో ఉన్న ఈ గ్యాంగ్‌కు ఎదురుగా ఉన్నది ఎంపీనా.. ఎమ్మెల్సీనా అన్నది తేడా లేకుండా దాడులకు తెగబడ్డారు. ఆదివారం కార్పొరేషన్‌ పోలింగ్‌ జరగుతున్న నేపథ్యంలో మరోసారి ఆ రౌడీ గ్యాంగ్‌ను తిరుపతికి రప్పించి ఆరు హోమ్‌స్టేలలో బస ఏర్పాటు చేసినట్టు సమాచారం. పోలింగ్‌ రోజు భయానక వాతావరణ సృష్టించడమే వారి లక్ష్యం. వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లు ఉండకుండా చూసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ముందుకు వచ్చిన ఏజెంట్లను ఎత్తుకెళ్లి కూటమికి అనుకూలంగా రిగ్గింగ్‌ చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్‌ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్పొరేషన్‌ అభ్యర్థులు గురువారం నిరసన తెలిపారు. పోలింగ్‌ రోజు అయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని కోరారు.

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌

డివిజన్లు : 66

పురుష ఓటర్లు : 1,43,292

మహిళా ఓటర్లు: 1,47,171

ఇతరులు : 29

పోలింగ్‌ కేంద్రాలు : 304

పుత్తూరు మున్సిపాలిటీ

వార్డులు : 36

పురుషులు : 19,410

మహిళలు : 20,797

ఇతరులు : 3

పోలింగ్‌ కేంద్రాలు: 70

వెంకటగిరి మున్సిపాలిటీ

వార్డులు : 36

పురుషులు : 21,226

మహిళలు : 22,912

ఇతరులు : 2

పోలింగ్‌ కేంద్రాలు : 66

నాయుడు పేట మున్సిపాలిటీ

వార్డులు : 32

పురుష ఓటర్లు : 17,648

మహిళా ఓటర్లు : 19,448

ఇతరులు : 4

పోలింగ్‌ కేంద్రాలు : 64

సూళ్లూరు పేట మున్సిపాలిటీ

వార్డులు : 32

పురుష ఓటర్లు : 17,178

మహిళా ఓటర్లు : 18,336

ఇతరులు : 5

పోలింగ్‌ కేంద్రాలు: 55

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement