మాట ఇస్తే.. తప్పడంతే! | - | Sakshi
Sakshi News home page

మాట ఇస్తే.. తప్పడంతే!

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

పేదల అభ్యున్నతే లక్ష్యంగా హామీల అమలు

వైఎస్సార్‌సీపీ సంక్షేమ పాలనను

గుర్తుచేసుకుంటున్న ప్రజలు

పేదలంటే ప్రేమ.. సమ సమాజ నిర్మాణమే లక్ష్యం.. ఆడపడుచుల ఆర్థికాభివృద్ధి చేయూతనందించాలనే చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సుపరిపాలన అందించారు. ఇచ్చిన మాటను తప్పకుండా హామీలను అమలు చేశారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందజేశారు.

బాబు పాలనలో

సంక్షేమం, అభివృద్ధి ఊసేలేదు

అవినీతి, కుట్రలు, బెదిరింపులు, దాడులు, కక్ష సాధింపులే రెండున్నరేళ్లుగా చంద్రబాబు సాగించిన పాలన. ఎన్నికల సమయంలో ప్రజలను వంచించి అధికారం చేపట్టారు. తర్వాత అలాంటి హామీలే ఇవ్వలేదంటూ వెటకారపు మాటలతో ప్రజలను వెన్నుపోటు పొడిచారు. అభివృద్ధి మాట దేవుడెరుగు ప్రజలకు అందిస్తామన్న సంక్షేమ పథకాల ఊసే ఎత్తడం లేదు. బాబు మాటలు నమ్మి మోసపోయామని సరైన సమయంలో బుద్ధి చెబుతామని జిల్లావాసులు మండిపడుతున్నారు.

తిరుపతి సిటీ : వైఎస్సార్‌సీపీ హయాంలో మేనిఫెస్టోను అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పవిత్ర గ్రంథంగా భావించారు. పార్టీ, కులం, మతం, వర్గాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలను అందించారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌తో సమానంగా భావించి ప్రభుత్వ కార్యాలయాలలోనూ, సచివాలయాల నోటీస్‌ బోర్డులోనూ పథకాలకు సంబంధించిన క్యాలెండర్‌ను అంటించారు. 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించి పథకాలను గడపగడపకూ అందజేశారు.

ఏడాదిలోనే 90శాతం హామీల అమలు

ప్రజలు అధికారం ఇచ్చారని గర్వపడలేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని కుంటి సాకులు చెప్పలేదు. అండగా నిలబడిన ప్రజలను వంచించి వెన్నుపోటు పొడవలేదు. తాను ఇచ్చిన హామీలలో 90శాతం వరకు ఏడాది పూర్తి కాకుండానే ప్రజలకు అందజేసి ప్రశంసలు అందుకున్నారు. నవరత్నాలను ప్రవేశపెట్టి కుటుంబలో మహిళల పేరు మీదనే పథకాలను అందించారు. జిల్లాలో సుమారు 9.25లక్షల మంది మహిళలకు అమ్మ ఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత, చేదోడు, వసతి దీవెన, విద్యాదీవెన వంటి ప్రధాన పథకాల ద్వారా రూ. 8వేల కోట్లకు పైగా ఏడాదిలో అందించడం గమనార్హం. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.13,500, ఆర్‌బీకేలు నిర్మించి పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించి రైతు పక్షపాతిగా నిలిచారు. జిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాలను నిర్మించి ఏడాది తిరగకముందే సుమారు 20వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. తొలి ఏడాదిలోని సుమారు 5లక్షల మందికి ఇంటిపట్టాలను అందజేశారు.

వెటకారపు మాటలు

ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు. అలాంటిది సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ప్రజలను హేళన చేస్తూ వెటకారంగా మాట్లాడడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్‌ పేరుతో హామీలను బాబు గుప్పించారు. సంక్షేమ పథకాల అమలు చేయాలంటే డబ్బులు లేవు.. సంపద సృష్టించి తర్వాత అందిస్తాం...అలా సంపద సృష్టించే ఐడియాలు ఏమైనా ఉంటే తనకు చెవిలో చెప్పాలంటూ అవహేళనగా నిండు సభలో మాట్లాడిన తీరుతో పథకాల అమలు అసాధ్యమని తేలిపోయింది. బాబు వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో సుమారు 10.23లక్షల మంది మహిళలు పలు పథకాల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త పింఛన్లు సుమారు 18వేల మందికి ఇవ్వాల్సి ఉండగా ఆ ఊసే ఎత్తలేదు. నిరుద్యోగభృతి, ఫీజురీయింబర్స్‌మెంట్‌లకు చరమగీతం పాడేశారు. జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఈ ఏడాదికి 4లక్షల ఉద్యోగాల ప్రకటనను గాలికి వదిలేశారు. ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులు చేస్తూ నిరంకుశత్వంగా పాలన సాగిస్తున్నారు.

జగనన్న పాలనలో అందించిన పథకాలు మచ్చుకు కొన్ని...

పథకం లబ్ధిదారుల సంఖ్య (మొత్తం రూ.కోట్లలో)

రైతుభరోసా 2,90,467 1,060.65

ఇన్‌పుట్‌ సబ్సిడీ 1,87,250 906.70

వైఎస్సార్‌ ఆసరా 3,32,276 2,722.75

వైఎస్సార్‌ సున్నా వడ్డీ(ఎస్‌హెచ్‌జీ) 3,36,998 304.50

వైఎస్సార్‌ కాపు నేస్తం 1,21,085 581.20

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం 1,00,102 805.16

జగనన్న తోడు 55,327 276.60

వైఎస్సార్‌ చేయూత 1,51,750 1,138.10

జగనన్న చేదోడు 1,32,082 940.30

అందరికీ ఇళ్లు 2,57,664 6441.60

వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా 87,457 65.78

అమ్మ ఒడి 2,57,556 1799.78

మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించిన వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement