మర్చంట్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ బ్రోకరేజ్ సంస్థ జీరోధా క్రమంగా ఇతర ఆర్థిక సేవల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా మర్చంట్ బ్యాంకింగ్ లైసెన్సు కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు సమర్పించింది. డేటా ప్రకారం జీరోధా కార్పొరేట్ అడ్వైజర్స్ ఏప్రిల్ 27న ఫైల్ చేసింది.
ప్రస్తుతం ఇది సెబీ పరిశీలనలో ఉంది. ఒకవేళ లైసెన్సు లభిస్తే ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో) నిర్వహణ, నిధుల సమీకరణలో కంపెనీలకు సలహాలివ్వడం, ఇతరత్రా మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసులు మొదలైనవి కంపెనీ అందించవచ్చు. ప్రస్తుతం జీరోధాకి 1.6 కోట్ల మంది పైగా కస్టమర్లు ఉండగా, కంపెనీ ప్లాట్‌ఫాంపై ఏటా వందల కోట్ల ఆర్డర్లు నమోదవుతుంటాయి.
జీరోధా ఏఎంసీ పేరిట సంస్థకి సొంతంగా మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. మర్చంట్ బ్యాంకింగ్ లైసెన్సు కోసం ఇన్‌క్రెడ్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నియో వెల్త్ మేనేజ్‌మెంట్, సొసైటీ జనరాలీ సెక్యూరిటీస్ ఇండియా తదితర 12 సంస్థలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి.


