తయారీ రంగ దన్ను కావాలి  | Transform mfg sector to become developed nation | Sakshi
Sakshi News home page

తయారీ రంగ దన్ను కావాలి 

May 31 2025 5:44 AM | Updated on May 31 2025 5:54 AM

Transform mfg sector to become developed nation

విప్లవాత్మక మార్పులకు తెరతీయాలి 

నితి ఆయోగ్‌ సీఈవో సుబ్రహ్మణ్యం

న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ఆవిర్భవించాలంటే ప్రధానంగా తయారీ రంగం అండగా నిలవాల్సి ఉంటుందని నితి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరతీయవలసి ఉన్నదని సలహా ఇచ్చారు.

 తద్వారా 2047కల్లా భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో తయారీ రంగం కీలక పాత్ర పోషించనున్నట్లు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వ్యవసాయ రంగం నుంచి ప్రజలను మళ్లించవలసి ఉన్నట్లు పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో సుబ్రహ్మణ్యం ప్రస్తావించారు. దేశీయంగా మొత్తం నైపుణ్య వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.   

Advertisement
 
Advertisement
Advertisement