ఈ రోజు బంగారం ధరలు ఇలా..
వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఈ రోజు (ఆదివారం) స్థిరంగా ఉన్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో ఎలాంటి మార్పు కనిపించలేదు. వెండి ధరల్లో కూడా ఎలాంటి తేడా లేదు. హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,180 వద్ద, 22 క్యారెట్ల ధర రూ.1,36,750 వద్ద ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ వారం బ్యాంక్ హాలిడేస్..
బ్యాంకుకు వెళ్లి మాత్రమే చేయాల్సిన పనులు ఏవైనా ఉంటే.. తప్పకుండా బ్యాంక్ హాలిడేస్ గురించి తెలుసుకోవాలి. బ్యాంకులకు సెలవులు ఎప్పటికప్పుడు.. రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. సాధారణంగా రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో పాటు జాతీయ, రాష్ట్ర పండుగలు, ఇతర ప్రాంతీయ పండుగల రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రతి ఏడాది హైక్ వస్తున్నా.. జీతం తక్కువేనా?
ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికీ జీతం చాలా ముఖ్యం. కానీ కెరీర్ ప్రారంభంలో మనం తీసుకునే జీతం.. తర్వాత మన సంపాదనపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా.. మొదటి ఉద్యోగంలోనే తక్కువ జీతంతో చేరి, ఆ తర్వాత ప్రతిసారీ కంపెనీ మారినప్పుడు పాత జీతంపై కొంత శాతం మాత్రమే పెంచుకుంటూ వెళ్తే.. ఏళ్ల తర్వాత కూడా మన జీతం చాలా తక్కువగా ఉండొచ్చు. ఈ విషయాన్ని వ్యాపారవేత్త వన్యా గోయెల్ వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
డబ్బు విలువ పడిపోతే?.. కియోసాకి హెచ్చరిక
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో డబ్బు విషయంలో ముందుగానే సిద్ధంగా ఉండటం ఎందుకు ముఖ్యమో చాలా సింపుల్ ఉదాహరణతో వివరించారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


