స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Stock market updates on May 07, 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

May 7 2025 9:33 AM | Updated on May 7 2025 10:17 AM

Stock market updates on May 07, 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 47 పాయింట్లు పెరిగి 24,426కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 134 పాయింట్లు పుంజుకుని 80,777 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.55 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 62.52 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో గతంతో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.77 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.87 శాతం దిగజారింది.

ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్‌ సెంటిమెంట్‌కు దోహదపడుతుంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, క్రూడాయిల్‌ ధరలు దిగిరావడంతో స్టాక్‌ సూచీలకు కొంత ఊరట లభిస్తున్నా, ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత్‌ చేసిన దాడుల పరిణామాలను మార్కెట్‌ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు దిగరావడంతో దేశీయ ఆయిల్‌ రిఫైనరీ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లకు డిమాండ్‌ నెలకొంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement