స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | stock market updates on march 27 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Mar 27 2025 9:47 AM | Updated on Mar 27 2025 9:47 AM

stock market updates on march 27 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ(Nifty) 55 పాయింట్లు పెరిగి 23,541కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 178 పాయింట్లు ఎగబాకి 77,469 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 104.33 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 73.14 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.12 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 2.04 శాతం దిగజారింది.

ఇదీ చదవండి: మనదే విని‘యోగం’!

అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇటీవల భవిష్యత్తులో కీలక వడ్డీరేట్ల కోత ఉంటుందనే సంకేతాలిచ్చిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్ల కోతపై ఇన్వెస్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) క్రమంగా విక్రయాలు తగ్గిస్తున్నారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచుతుంది. భారత రూపాయి స్థిరత్వం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఏప్రిల్‌ 2న ట్రంప్‌ ఇండియాపై విధించనున్న ప్రతికార సుంకాలపై నిర్ణయం వెలువరించనున్నట్లు తెలిపారు. దాంతో మార్కెట్‌ వర్గాలు దీన్ని పరిశీలించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement