మార్కెట్ల భారీ పతనం! | Stock Market Today closing | Sakshi
Sakshi News home page

మార్కెట్ల భారీ పతనం!

Aug 2 2024 3:40 PM | Updated on Aug 2 2024 3:55 PM

Stock Market Today closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు  శుక్రవారం భారీగా పతనమయ్యాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన బెంచ్‌ మార్క్‌ సూచీలు ఏమాత్రం కోలుకోలేకపోయాయి. ఇటీవల భారీగా మార్కెట్లు గరిష్ఠాలను చేరుకోవడంతో మదుపర్లు లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపడంతో ఇండెక్స్‌లు భారీ పడిపోయాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 942.87 పాయింట్లు 1.15% పతనమై 80,924.68 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 311.40 పాయింట్లు లేదా 1.25% నష్టపోయి 24,699.50 వద్దకు క్షీణించింది.

ఐషర్‌ మోటర్స్‌, మారుతీ సుజుకీ, టాటా మోటర్స్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌గా నష్టాలను చవిచూశాయి. దివీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, కోటక్‌ మహీంద్రా షేర్లు టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement