లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు | Stock Market Today closing | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Jul 29 2024 3:45 PM | Updated on Jul 29 2024 3:48 PM

Stock Market Today closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో సెషన్‌ను మొదలు పెట్టిన బెంచ్‌ మార్క్‌ సూచీలు అవే లాభాలను కొనసాగించాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30.39 పాయింట్లు లేదా 0.037% శాతం లాభంతో 81,363.11 వద్ద, నిఫ్టీ 7.60 పాయింట్లు లేదా 0.031% శాతం పెరిగి 24,842.45 వద్ద ఉన్నాయి.

నిఫ్టీలో దివిస్‌ ల్యాబ్స్‌, బీపీసీఎల్‌, లార్సెన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీల షేర్లు టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సిప్లా, ఐటీసీ, కొటక్‌ మహీంద్రా షేర్లు టాప్‌ లూజర్స్‌గా నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement