నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

Aug 8 2024 9:28 AM | Updated on Aug 8 2024 11:16 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్లు  గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 65 పాయింట్లు తగ్గి 24,237కు చేరింది. సెన్సెక్స్‌ 202 పాయింట్లు నష్టపోయి 79,286 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 103.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 78 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 3.93 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.8 శాతం, నాస్‌డాక్‌ 1.05 శాతం  నష్టపోయాయి.

గడిచిన సెషన్‌ల్లో మార్కెట్‌ భారీగా పడింది. జపాన్‌ కరెన్సీ యెన్‌ పడిపోతుండడం మార్కెట్‌ను మరింత నష్టాల్లోకి తీసుకెళ్తుంది. బుధవారం యెన్‌ కాస్త పుంజుకోవడం, జపాన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ ఇకపై వడ్డీరేట్లును పెంచమని చెప్పడంతో మార్కెట్లు లాభాల్లోకి చేరాయి. కానీ తిరిగి యెన్‌ దిగజారింది. దాంతో యూఎస్‌ మార్కెట్లు, గిఫ్ట్‌ నిఫ్టీ నష్టాల్లోకి వెళ్లాయి.

ఇలాంటి నష్టాలతో కూడిన ఒడిదొడుకులున్న మార్కెట్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారు ఎలాంటి భయాలకు లోనుకాకుండా వాటిని కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌ ఇలా భారీగా పతనమైనపుడు క్వాలిటీ స్టాక్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి లాభాలు సంపాదించవచ్చని చెబుతున్నారు. భారత్‌ ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న దేశం. మార్కెట్‌లోని ఒడిదొడుకులను ఒక అవకాశంగా తీసుకుని మంచి స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే మరిన్ని లాభాలు సొంతం చేసుకోవచ్చని అంటున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement