స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు

Jul 24 2024 9:25 AM | Updated on Jul 24 2024 9:35 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ 16 పాయింట్లు తగ్గి 24,464కు చేరింది. సెన్సెక్స్‌ 34 పాయింట్లు నష్టపోయి 80,392 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 81.5 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.26 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.16 శాతం, నాస్‌డాక్‌ 0.06 శాతం  నష్టపోయాయి.

వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధన దిశగా సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్‌ స్టాక్‌ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. దాంతో మంగళవారం నష్టాల్లోకి చేరుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగ సమయంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ సెక్యూరిటీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్‌టీటీ), స్వల్పకాలిక మూలధన రాబడి(ఎస్‌టీసీజీ), ధీర్ఘ కాలిక మూలధన రాబడి(ఎల్‌టీసీజీ)లపై పన్నుల పెంపు ప్రతిపాదనలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి.

అయితే పన్ను మినహాయింపులు, కస్టమ్స్‌ సుంకం తగ్గింపు, ద్రవ్యోలోటు కట్టడికి చర్యల ప్రకటనలతో సూచీలు మళ్లీ పుంజుకొని స్వల్ప నష్టాలతో ముగిశాయి. రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్, ఇండస్ట్రీయల్, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, మెటల్, కమోడిటీస్, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కన్జూమర్‌ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, సర్వీసెస్, ఫార్మా, టెక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement