నష్టాల్లోకి చేరుకున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

నష్టాల్లోకి చేరుకున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Jul 19 2024 9:57 AM | Updated on Jul 19 2024 10:05 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 51 పాయింట్లు తగ్గి 24,740కు చేరింది. సెన్సెక్స్‌ 82 పాయింట్లు నష్టపోయి 81,261 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104.14 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 84.6 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.8 శాతం, నాస్‌డాక్‌ 0.7 శాతం  నష్టపోయాయి.

ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్న జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను మెప్పిస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు ఈ రంగ షేర్లకు మరింత డిమాండ్‌ పెంచాయి. దాంతో ఐటీ షేర్లు పెరుగుతున్నాయి. వచ్చేవారంలో బడ్జెట్‌ సమావేశాలు ఉంటుండడంతో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement