స్టాక్‌ మార్కెట్‌లో కొనసాగుతున్న బుల్‌ ర్యాలీ | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్‌లో కొనసాగుతున్న బుల్‌ ర్యాలీ

Jul 16 2024 9:24 AM | Updated on Jul 16 2024 10:02 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 24,613కు చేరింది. సెన్సెక్స్‌ 66 పాయింట్లు లాభపడి 80,730 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104.23 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 84.8 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.21 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.26 శాతం, నాస్‌డాక్‌ 0.4 శాతం  లాభపడ్డాయి.

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం కొత్త గరిష్టాలకు చేరడంతో ఇన్వెస్టర్ల సంపద సైతం జీవితకాల గరిష్టానికి చేరుకుంది. గడచిన రెండు మార్కెట్‌ సెషన్‌ల్లో రూ.3.85 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. సోమవారం ఒక్కరోజే రూ.2.70 లక్షల కోట్లు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం విలువ ఆల్‌టైం హై రూ.455.08 లక్షల కోట్లకు (5.45 ట్రిలియన్‌ డాలర్లు) చేరింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు రాణించడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో స్టాక్‌ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే బడ్జెట్‌పై ఆశావహ దృక్పథం, ఐటీ రంగ కంపెనీలు అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలు ప్రకటించడం తదితర అంశాలు కలిసొచ్చాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement