లాభాల్లో ముగిసిన మార్కెట్లు | Stock Market Rally On Today closing | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sep 9 2024 3:57 PM | Updated on Sep 9 2024 4:00 PM

Stock Market Rally On Today closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 తర్వాత మెరుగుపడి లాభాల్లో సెషన్‌ను ముగించాయి. ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 375.61 పాయింట్లు లేదా 0.46 శాతం పెరిగి 81,559.54 వద్ద, నిఫ్టీ 50 84.25 పాయింట్లు లేదా 0.34 శాతం లాభపడి 24,936 వద్ద స్థిరపడ్డాయి.

నిఫ్టీ లిస్టింగ్‌లో హిందూస్థాన్‌ యూనిలివర్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, బ్రిటానియా టాప్‌ గెయినర్స్‌గా లాభాలు అందుకున్నాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా, హిందాల్కో, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్‌ టాప్‌ లూజర్స్‌గా నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement