జీవితకాల గరిష్ఠాల్లో మార్కెట్లు.. నిఫ్టీ@25,158 | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

జీవితకాల గరిష్ఠాల్లో మార్కెట్లు.. నిఫ్టీ@25,158

Aug 29 2024 3:35 PM | Updated on Aug 29 2024 3:35 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం జీవితకాల గరిష్ఠాల్లో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 106 పాయింట్లు పెరిగి 25,158 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 349 పాయింట్లు ఎగబాకి 82,134 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, నెస్లే, యాక్సిస్‌ బ్యాంకు కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

ఎం అండ్‌ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ ఫార్మా, కొటక్‌ మహీంద్రా బ్యాంకు, టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌, ఎల్‌ అండ్‌ టీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

మార్కెట్‌ ముగిసే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం సమావేశం నిర్వహించారు. అందులో ప్రధానంగా ఈక్విటీ షేర్‌హోల్డర్‌కు 1:1 బోనస్ ఇష్యూను పరిశీలించడానికి 2024 సెప్టెంబర్ 5న తన డైరెక్టర్ల బోర్డుతో సమావేశం కానుందని వెల్లడించారు. 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్‌ ప్రకటించారు. జియో వినియోగదారులు 100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజిని పొందుతారని తెలిపారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement