దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల బాటలో అడుగులు వేసాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 519.03 పాయింట్లు లేదా 0.70 శాతం లాభంతో 74,371.93 వద్ద, నిఫ్టీ 150.25 పాయింట్లు లేదా 0.66 శాతం లాభంతో 23,039.20 వద్ద సాగుతున్నాయి.
ఎల్&టి టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్, విప్రో లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏబీబీ ఇండియా లిమిటెడ్, జైప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, గాలంట్ ఇస్పాట్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


