సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 876.38 పాయింట్లు లేదా 1.17 శాతం నష్టంతో 73,852.90 వద్ద, నిఫ్టీ 257.20 పాయింట్లు లేదా 1.11 శాతం నష్టంతో 22,888.95 వద్ద నిలిచాయి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అర్బన్ కంపెనీ లిమిటెడ్, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ లిమిటెడ్, సమ్మాన్ క్యాపిటల్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


