బోనస్‌ వస్తోందోచ్‌.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’! | Diwali bonus post office employees how much will they get | Sakshi
Sakshi News home page

బోనస్‌ వస్తోందోచ్‌.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!

Oct 19 2026 12:02 PM | Updated on Oct 19 2026 12:51 PM

Diwali bonus post office employees how much will they get

తపాలా శాఖ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దీపావళి పండుగ వేళ బోనస్‌ ప్రకటించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి అర్హులైన ఉద్యోగులకు 60 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్‌ (పీఎల్‌బీ) చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. అక్టోబర్‌ 16న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బోనస్‌ లెక్కింపునకు నెలవారీ వేతన పరిమితిని రూ.7,000గా నిర్ణయించారు. అధికారిక లెక్కింపు సూత్రం ప్రకారం పూర్తి ఏడాదికి అర్హులైన రెగ్యులర్‌ ఉద్యోగులు, గ్రామీణ డాక్‌ సేవకులకు గరిష్ఠంగా సుమారు రూ.13,816 అందే అవకాశం ఉంది.

ఎవరెవరికి బోనస్‌ వర్తిస్తుందంటే..

  • రెగ్యులర్‌ ఉద్యోగులు: మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌), గ్రూప్‌-సి, నాన్‌ గెజిటెడ్‌ గ్రూప్‌-బి ఉద్యోగులు.

  • గ్రామీణ డాక్‌ సేవకులు (జీడీఎస్‌): అర్హత నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్న వారికి ఎక్స్‌గ్రేషియా బోనస్‌ లభిస్తుంది.

  • తాత్కాలిక ఉద్యోగులు: నిర్దేశిత సర్వీసు నిబంధనలు నెరవేర్చిన పూర్తికాల క్యాజువల్‌ కార్మికులు, తాత్కాలిక హోదా కలిగిన కార్మికులకు ప్రత్యేక బోనస్‌ వర్తిస్తుంది.

బోనస్‌ ఎలా లెక్కిస్తారు?

రెగ్యులర్‌ ఉద్యోగులు, జీడీఎస్‌లకు వర్తించే బోనస్‌ లెక్కింపులో నెలవారీ అర్హత కలిగిన వేతనం లేదా అలవెన్సులను గరిష్ఠంగా రూ.7,000గా పరిగణిస్తారు. 60 రోజుల బోనస్‌ను లెక్కించేందుకు నెలకు సగటున 30.4 రోజులు ఉన్నట్లు తీసుకుంటారు. అందువల్ల పూర్తి ఏడాది అర్హత ఉన్నవారికి గరిష్ఠంగా రూ.13,816 వస్తుంది. ఏడాది మధ్యలో విధుల్లో చేరినవారు లేదా కొంతకాలమే పనిచేసినవారికి అర్హత కలిగిన సర్వీసు ఆధారంగా మొత్తం మారుతుంది.

క్యాజువల్‌ కార్మికులకు మాత్రం నెలకు రూ.1,200 నామమాత్రపు వేతనాన్ని ఆధారంగా తీసుకుని బోనస్‌ లెక్కిస్తారు. నిర్దేశిత పని దినాలు, సర్వీసు నిబంధనలు నెరవేర్చినవారికే ఈ ప్రయోజనం అందుతుంది.

ఇదీ చదవండి: మారే మార్కెట్లలో ఎందులో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement