breaking news
Post Office staff
-
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
తపాలా శాఖ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దీపావళి పండుగ వేళ బోనస్ ప్రకటించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి అర్హులైన ఉద్యోగులకు 60 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్బీ) చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. అక్టోబర్ 16న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బోనస్ లెక్కింపునకు నెలవారీ వేతన పరిమితిని రూ.7,000గా నిర్ణయించారు. అధికారిక లెక్కింపు సూత్రం ప్రకారం పూర్తి ఏడాదికి అర్హులైన రెగ్యులర్ ఉద్యోగులు, గ్రామీణ డాక్ సేవకులకు గరిష్ఠంగా సుమారు రూ.13,816 అందే అవకాశం ఉంది.ఎవరెవరికి బోనస్ వర్తిస్తుందంటే..రెగ్యులర్ ఉద్యోగులు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్), గ్రూప్-సి, నాన్ గెజిటెడ్ గ్రూప్-బి ఉద్యోగులు.గ్రామీణ డాక్ సేవకులు (జీడీఎస్): అర్హత నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్న వారికి ఎక్స్‌గ్రేషియా బోనస్ లభిస్తుంది.తాత్కాలిక ఉద్యోగులు: నిర్దేశిత సర్వీసు నిబంధనలు నెరవేర్చిన పూర్తికాల క్యాజువల్ కార్మికులు, తాత్కాలిక హోదా కలిగిన కార్మికులకు ప్రత్యేక బోనస్ వర్తిస్తుంది.బోనస్ ఎలా లెక్కిస్తారు?రెగ్యులర్ ఉద్యోగులు, జీడీఎస్‌లకు వర్తించే బోనస్ లెక్కింపులో నెలవారీ అర్హత కలిగిన వేతనం లేదా అలవెన్సులను గరిష్ఠంగా రూ.7,000గా పరిగణిస్తారు. 60 రోజుల బోనస్‌ను లెక్కించేందుకు నెలకు సగటున 30.4 రోజులు ఉన్నట్లు తీసుకుంటారు. అందువల్ల పూర్తి ఏడాది అర్హత ఉన్నవారికి గరిష్ఠంగా రూ.13,816 వస్తుంది. ఏడాది మధ్యలో విధుల్లో చేరినవారు లేదా కొంతకాలమే పనిచేసినవారికి అర్హత కలిగిన సర్వీసు ఆధారంగా మొత్తం మారుతుంది.క్యాజువల్ కార్మికులకు మాత్రం నెలకు రూ.1,200 నామమాత్రపు వేతనాన్ని ఆధారంగా తీసుకుని బోనస్ లెక్కిస్తారు. నిర్దేశిత పని దినాలు, సర్వీసు నిబంధనలు నెరవేర్చినవారికే ఈ ప్రయోజనం అందుతుంది.ఇదీ చదవండి: మారే మార్కెట్లలో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? -
మెట్టు ఎక్కితేనే పింఛను!
♦ సిగ్నల్స్ అందక మొరాయిస్తున్న మిషన్లు ♦ లబ్ధిదారులకు అవస్థలు ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలు జూకల్ నివాసి సాయమ్మ. వృద్ధాప్య పింఛన్ పొందుతున్న ఈమె గురువారం గ్రామంలో పోస్టాఫీసు ద్వారా అందజేస్తున్న డబ్బులను తీసుకోవడానికి వచ్చింది. అయితే ఎన్రోల్మెంట్ కోసం మళ్లీ కొత ్తగా లబ్ధిదారుల వివరాలు, వేలి ముద్రలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా.. ఎన్రోల్మెంట్ చేసే మిషన్‌కు గ్రామంలో సిగ్నల్స్ సరిగా అందలేదు. దీంతో స్థానిక బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఈ మిషన్ తీసుకుని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవ నం మొదటి అంతస్తులో ఎన్రోల్మెంట్ చేశారు. అయితే వృ ద్ధాప్యం, అంగవైకల్యం కారణంగా ఆపసోపాలు పడుకుంటూ ఇంత దూరం వచ్చిన సాయ మ్మ మెట్లు వరకు వచ్చి ఆగిపోయింది. కిందకు వస్తే మిషన్‌కు సిగ్నల్స్ అందవు. సాయమ్మ మెట్లు ఎక్కలేదు. ఇదీ గ్రామాలలోని వృద్ధుల పరిస్థితి. శంషాబాద్ రూరల్ : బయోమెట్రిక్ విధానంతో పోస్టాఫీసుల ద్వారా లబ్ధిదారులకు పింఛన్ల్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఈ నెల నుంచి లబ్ధిదారుల ఆధార్‌కార్డు, ఫొటోలు, వేలిముద్రలను సేకరిస్తున్నారు. ఇందు కోసం వినియోగిస్తున్న మిషన్లకు స్థా నికంగా సిగ్నల్స్ అందకపోవడంతో పాటు సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కొక్క లబ్ధిదారుల వివరాలు సేకరించడానికి 15-30 నిమిషాల సమ యం పడుతుందని పోస్టుమాస్టర్లు పేర్కొంటున్నారు. ఈ నెల 21 నుంచి ఈ విధానం ప్రారంభించగా ఇప్పటి వర కు కేవలం 20 శాతం మాత్రమే పంపిణీ చేశారు. అందరూ ఇక్కడికే రావాలి.. మండల పరిధిలోని పాల్మాకులలో పోస్ట్ సబ్ ఆఫీసు ఉండగా.. దీని పరిధిలో సుమారు 10 గ్రామాల లబ్ధిదారులకు పింఛన్ల్ అందజేయాల్సి ఉంది. మిగతా చోట్ల బ్రాంచ్ పోస్టు ఆఫీసులు ఉన్నాయి. బ్రాంచ్ పోస్టు ఆఫీసుల పరిధిలోని గ్రామాలకు పోస్టుమాస్టర్లు వెళ్లి పింఛన్ల్ అందజేస్తున్నారు. కాని పాల్మాకుల పోస్ట్ సబ్ ఆఫీసు పరిస్థితి భిన్నం. చుట్టు పక్కల గ్రామాల వారంతా ఇక్కడికి వచ్చి పింఛన్ల్ తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు. రోజూ వారి ఆర్థిక లావాదేవీలు, ఉత్తరాల బట్వాడా, ఇతర పనుల కోసం కార్యాలయాన్ని మూసి వెళ్లడం సాధ్యకాదని, ఇక్కడి నుంచి పింఛన్ల్ అందజేస్తామని చెబుతున్నారు. నానా అవస్థలు.. పాల్మాకుల పోస్ట్ సబ్ ఆఫీస్ పరిధిలోని ముచ్చింతల్, మదన్‌పల్లి, పెద్దతూప్ర, పెద్దతూప్రతండా, పిల్లోనిగూడ, ఇనాంషేరి, అచ్చంపేట, మేకలబండతం డాల నుంచి వృద్ధులు, వికలాంగులు పింఛన్ల కోసం ఇక్కడికి వస్తున్నారు. మూడు రోజులుగా ఇక్కడ గంటల కొద్ది పడిగాపులు కాస్తూ నానా పాట్లు పడుతున్నారు. గ్రామాల్లోనే పంపిణీ చేస్తాం.. పింఛన్లను గ్రామాల్లోనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పాల్మాకుల పోస్టాఫీసు సిబ్బంది తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. వేరే గ్రామాలకు ఎవరూ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. - శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓ రోజూ రూ.30 కిరాయి అవుతుంది.. మా ఊరి నుంచి పాల్మాకుల రావడానికి రోజూ బస్సు కిరాయి రూ.30 అవుతుంది. రెండు రోజుల నుంచి వస్తున్నాము. ఇంత దూరం వచ్చి పింఛన్ తీసుకెళ్లాలంటే చాలా కష్టం. - అడివమ్మ, ముచ్చింతల్


