
మెట్టు ఎక్కితేనే పింఛను!
బయోమెట్రిక్ విధానంతో పోస్టాఫీసుల ద్వారా లబ్ధిదారులకు పింఛన్ల్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది
♦ సిగ్నల్స్ అందక మొరాయిస్తున్న మిషన్లు
♦ లబ్ధిదారులకు అవస్థలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలు జూకల్ నివాసి సాయమ్మ. వృద్ధాప్య పింఛన్ పొందుతున్న ఈమె గురువారం గ్రామంలో పోస్టాఫీసు ద్వారా అందజేస్తున్న డబ్బులను తీసుకోవడానికి వచ్చింది. అయితే ఎన్‌రోల్‌మెంట్ కోసం మళ్లీ కొత ్తగా లబ్ధిదారుల వివరాలు, వేలి ముద్రలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా.. ఎన్‌రోల్‌మెంట్ చేసే మిషన్‌కు గ్రామంలో సిగ్నల్స్ సరిగా అందలేదు. దీంతో స్థానిక బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఈ మిషన్ తీసుకుని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవ నం మొదటి అంతస్తులో ఎన్‌రోల్‌మెంట్ చేశారు. అయితే వృ ద్ధాప్యం, అంగవైకల్యం కారణంగా ఆపసోపాలు పడుకుంటూ ఇంత దూరం వచ్చిన సాయ మ్మ మెట్లు వరకు వచ్చి ఆగిపోయింది. కిందకు వస్తే మిషన్‌కు సిగ్నల్స్ అందవు. సాయమ్మ మెట్లు ఎక్కలేదు. ఇదీ గ్రామాలలోని వృద్ధుల పరిస్థితి.
శంషాబాద్ రూరల్ : బయోమెట్రిక్ విధానంతో పోస్టాఫీసుల ద్వారా లబ్ధిదారులకు పింఛన్ల్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఈ నెల నుంచి లబ్ధిదారుల ఆధార్‌కార్డు, ఫొటోలు, వేలిముద్రలను సేకరిస్తున్నారు. ఇందు కోసం వినియోగిస్తున్న మిషన్లకు స్థా నికంగా సిగ్నల్స్ అందకపోవడంతో పాటు సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కొక్క లబ్ధిదారుల వివరాలు సేకరించడానికి 15-30 నిమిషాల సమ యం పడుతుందని పోస్టుమాస్టర్లు పేర్కొంటున్నారు. ఈ నెల 21 నుంచి ఈ విధానం ప్రారంభించగా ఇప్పటి వర కు కేవలం 20 శాతం మాత్రమే పంపిణీ చేశారు.
అందరూ ఇక్కడికే రావాలి..
మండల పరిధిలోని పాల్మాకులలో పోస్ట్ సబ్ ఆఫీసు ఉండగా.. దీని పరిధిలో సుమారు 10 గ్రామాల లబ్ధిదారులకు పింఛన్ల్ అందజేయాల్సి ఉంది. మిగతా చోట్ల బ్రాంచ్ పోస్టు ఆఫీసులు ఉన్నాయి. బ్రాంచ్ పోస్టు ఆఫీసుల పరిధిలోని గ్రామాలకు పోస్టుమాస్టర్లు వెళ్లి పింఛన్ల్ అందజేస్తున్నారు. కాని పాల్మాకుల పోస్ట్ సబ్ ఆఫీసు పరిస్థితి భిన్నం. చుట్టు పక్కల గ్రామాల వారంతా ఇక్కడికి వచ్చి పింఛన్ల్ తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు. రోజూ వారి ఆర్థిక లావాదేవీలు, ఉత్తరాల బట్వాడా, ఇతర పనుల కోసం కార్యాలయాన్ని మూసి వెళ్లడం సాధ్యకాదని, ఇక్కడి నుంచి పింఛన్ల్ అందజేస్తామని చెబుతున్నారు.
నానా అవస్థలు.. పాల్మాకుల పోస్ట్ సబ్ ఆఫీస్ పరిధిలోని ముచ్చింతల్, మదన్‌పల్లి, పెద్దతూప్ర, పెద్దతూప్రతండా, పిల్లోనిగూడ, ఇనాంషేరి, అచ్చంపేట, మేకలబండతం డాల నుంచి వృద్ధులు, వికలాంగులు పింఛన్ల కోసం ఇక్కడికి వస్తున్నారు. మూడు రోజులుగా ఇక్కడ గంటల కొద్ది పడిగాపులు కాస్తూ నానా పాట్లు పడుతున్నారు.
గ్రామాల్లోనే పంపిణీ చేస్తాం..
పింఛన్లను గ్రామాల్లోనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పాల్మాకుల పోస్టాఫీసు సిబ్బంది తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. వేరే గ్రామాలకు ఎవరూ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు.
- శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓ
రోజూ రూ.30 కిరాయి అవుతుంది..
మా ఊరి నుంచి పాల్మాకుల రావడానికి రోజూ బస్సు కిరాయి రూ.30 అవుతుంది. రెండు రోజుల నుంచి వస్తున్నాము. ఇంత దూరం వచ్చి పింఛన్ తీసుకెళ్లాలంటే చాలా కష్టం.
- అడివమ్మ, ముచ్చింతల్