వైఎస్సార్‌సీపీ నేతలు, అభ్యర్థులే టార్గెట్‌.. పోలీసుల కుట్రలు | YSRCP ZPTC And MPTC Candidates Arrest By AP Police Today Updates | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతలు, అభ్యర్థులే టార్గెట్‌.. పోలీసుల కుట్రలు

Oct 21 2026 7:29 AM | Updated on Oct 21 2026 7:47 AM

YSRCP ZPTC And MPTC Candidates Arrest By AP Police Today Updates

జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు సంబంధించి అప్‌డేట్స్‌.. 

ఇదీ ఒక గెలుపేనా: అవినాష్‌ రెడ్డి ఫైర్‌

  • వైఎస్సార్ జిల్లా..
  • పులివెందులలో పచ్చమూకలు దాడి చేసిన ప్రదేశాన్ని పరిశీలించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
  • కౌన్సిలర్ అభ్యర్ధుల ఇంటిపై బీరు బాటిళ్లతో దాడి, వాహనాలు దగ్దం
  • దగ్ధమైన వాహనాలను పరిశీలించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
  • వారం రోజులుగా టీడీపీ గూండాలు, పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు
  • వాహనాల ధ్వంసం, షాపుల దగ్డంతో పాటు కాల్పులు చేస్తున్నారు
  • తాము గెలవలేమని తెలిసి ఇలా అరాచకాలకు తెరలేపారు
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మా పార్టీ లీడర్లందరినీ అరెస్టులు చేస్తున్నారు
  • నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు అరెస్టుల పర్వానికి తెరలేపారు
  • మా పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టీ ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు
  • ఇన్ని అరాచకాలు చేసి గెలిచే గెలుపును ఒక గెలుపు అంటారా?

నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు..

  • ఏపీలో నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు..
  • ఎంపీటీసీ-9829, జడ్పీటీసీ-659 స్థానాలకు ఎన్నికలు.
  • ఈనెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న స్క్రూటినీ
  • ఈనెల 27 వరకు నామినేషన్ల విత్‌డ్రాకు గడువు.
  • నవంబర్‌ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్‌.
  • నవంబర్‌ 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

తిరుపతిలో కొనసాగుతున్న దౌర్జన్యకాండ

  • తిరుపతి జిల్లాలో టీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది.
  • జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లను అడ్డుకునేందుకు కుట్రలు.
  • రైల్వేకోడూరులో 500 మంది గూండాలను సిద్ధం చేసిన కూటమి నేతలు
  • నామినేషన్‌ సెంటర్ల వద్ద మోహరించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునే కుట్ర.
  • ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న నామినేషన్లు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా దాడులకు ప్లాన్‌.
  • ఏకగ్రీవాలు చేసుకోవాలని దాడులకు తెగబడుతున్న కూటమి నేతలు.
  • మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లలో వ్యవహరించిన తీరుగానే మళ్లీ రిపీట్‌ చేస్తున్న కూటమి నేతలు. 

వైఎస్సార్ జిల్లా...

  • బద్వేల్ నియోజకవర్గంలో పోలీసులను అడ్డుపెట్టుకుని కొనసాగుతున్న టీడీపీ అరాచకాలు..
  • ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఇండ్ల వద్దకు చేరుకున్న పోలీసులు.
  • జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన నాయకులను పలు పోలీస్ స్టేషన్లకు తరలింపు.

 

👉ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టార్గెట్‌ చేసి దాడులు చేస్తున్నారు. అరాచకాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారు.  

పల్నాడు జిల్లా..

  • మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్

  • జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కోసం నామినేషన్ సందర్భంగా పిడుగురాళ్ల వైఎస్సార్‌సీపీ ఆఫీసులో ఉన్న కాసు మహేష్ రెడ్డి

  • పిడుగురాళ్ల పార్టీ ఆఫీసు వద్ద భారీ స్థాయిలో పోలీసుల మొహరింపు

  • పిడుగురాళ్ల పార్టీ కార్యాలయంలో కాసు మహేష్ రెడ్డిని అరెస్ట్ చేసి నరసరావుపేట ఇంటికి తరలించిన పోలీసులు

వైఎస్సార్ జిల్లా

  • పులివెందులలో అర్ధరాత్రి టీడీపీ అరాచకం

  • మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన నిరంజన్ రెడ్డి, అంజనప్ప ఇళ్లపై దాడి

  • నిరంజన్ రెడ్డి ఇంటిపై బీరు బాటిళ్లతో దాడి

  • ఇంటి ముందు ఉన్న లారీ తగలబెట్టిన పచ్చ మూకలు

  • అంజనప్ప ఇంటి వద్ద స్కూటీని దగ్దం చేసిన టీడీపీ గూండాలు

  • నామినేషన్ వేసిన వారిని ప్రచారం చేసుకోనివ్వకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్న టీడీపీ

 

పోరుమామిళ్ల పోలీసుల ఓవరాక్షన్

  • మండలంలోని ముఖ్యమైన వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు

  • జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా ఎక్కడికి అక్కడ అరెస్టు చేస్తున్న పోలీసులు

  • కొండాపురం మండలం జడ్పీటీసీ అభ్యర్థి శివారెడ్డిని అరెస్టు చేసి తాళ్ల పొద్దుటూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు

  • వైఎస్సార్‌సీపీ నాయకుడు హరి నారాయణ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు

  • ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో ఎంపిటీసీ అభ్యర్థి కల్లూరు నాగేంద్ర రెడ్డి అరెస్టు చేసిన పోలీసులు

 

రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం..

  • రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ గూండాల బీభత్సం

  • వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్ధులపై అక్రమ కేసులు

  • అర్ధరాత్రి నుండి అరెస్టులు చేస్తున్న పోలీసులు

  • నామినేషన్లు దాఖలు చేయకుండా అభ్యర్ధులను ఎత్తుకెళ్తున్న పోలీసులు

  • పోటీ చేసే అభ్యర్ధులకు టీడీపీ నేతల వార్నింగ్‌.

ఇదీ చదవండి: పోలీసులు కాల్పులు జరిపి, రాళ్లతో దాడి చేశారు: సజ్జల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement