బద్వేలు వైఎస్సార్సీపీ సమన్వయ కమిటీ ఏర్పాటు | Local Body Elections: YSRCP coordination committee set up in Badvel | Sakshi
Sakshi News home page

బద్వేలు వైఎస్సార్సీపీ సమన్వయ కమిటీ ఏర్పాటు

Oct 20 2026 6:45 PM | Updated on Oct 20 2026 6:49 PM

Local Body Elections: YSRCP coordination committee set up in Badvel

బద్వేలు: వైఎస్సార్‌ జిల్లా బద్వేలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్పార్‌సీపీని విజయం దిశగా నడిపించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు పార్టీ సమన్వయ కమిటీ వివరాలను జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్‌ రెడ్డి మంగళవారం(అక్టోబర్‌ 20వ తేదీ) వెల్లడించారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ బద్వేలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. 

అదనపు కో-ఆర్డినేటర్లుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎన్‌. విశ్వనాథ్‌ రెడ్డిలను నియమించారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలోపేతం దిశగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లు రవీంద్రనాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. పార్టీని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం దిశగా నడిపించేందుకు సమన్వయ కమిటీ కృషి చేస్తుందన్నారు. 

ఇదీ చదవండి:  పోలీసులు కాల్పులు జరిపి, రాళ్లతో దాడి చేశారు: సజ్జల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement