తిరుపతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోటీ చేయకుండా ఉండేందుకు బెదిరింపు చర్యలకు దిగుతూ దాడులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజవర్గం ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి విమర్శించారు. తమిళనాడు కాట్పాడి ప్రాంతం నుంచి రౌడీలను రప్పించి దాడులకు ఉసుగొల్పుతున్నారన్నారని మండిపడ్డారు. ఆ రౌడీలను తిరుపతి రఘునాథ రీస్టార్ట్ ప్రాంతంలో మోహరించారని మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ, డీజీపీలకు ఫిర్యాదు చేశామన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారు ప్రతి గ్రామంలో 70-80శాతం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలుపై దాడులు చేయాలని కుట్ర చేస్తున్నారు. దాడులు జరిగితే దీనికి జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలి, రాత పూర్వకంగా ఫిర్యాదు చేశాం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి రౌడీ మూకలు దాడులు చేస్తే ఎన్నికలు జరిపేది ఎలా.. ?, తిరుమల నగర్ మాజీ సర్పంచ్ శివ శంకర్ రాజు నో డ్యూస్ సర్టిఫికేట్ కోసం దాఖలు చేస్తే వారిని బెదిరిస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే ఓటమి భయంతో ఇదంతా చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఎన్నికల అధికారికి ఆర్కే రోజా ఫిర్యాదు


