రౌడీలను తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు: ఎంపీ మిథున్‌రెడ్డి | MP Mithun Reddy Slams TDP Over Intimidation Tactics | Sakshi
Sakshi News home page

రౌడీలను తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు: ఎంపీ మిథున్‌రెడ్డి

Oct 20 2026 3:16 PM | Updated on Oct 20 2026 3:28 PM

MP Mithun Reddy Slams TDP Over Intimidation Tactics

అన్నమయ్య జిల్లా: టీడీపీ అరాచకాలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చౌడేపల్లిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మిథున్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘మీ భయాన్ని పెట్టుబడిగా చేసుకుని వాళ్లు రాజకీయం చేస్తున్నారు.. భయపడితే రాజకీయం చేయలేం. నామినేషన్ వేసేందుకు నేనే ముందు వెళ్లా. మీరు పోండి నేను వస్తా అనలేదు. వాళ్లు భయపడి తలా ఓ పక్క అడ్రస్ లేకుండా పోయారు. మర్డర్లు, అత్యాచారాలు చేయలేదు భయపడకండి. 

కేసులు పెడతారు అంతేగా.. తలెత్తుకుపోయా.. తల ఎత్తుకొనివచ్చా.. తప్పు చేయనప్పుడు భయపడే అవసరం లేదు. ఎవ్వరికి ఏం జరిగినా నాదే బాధ్యత. నేను కాపాడుకుంటా. నేను మిమ్మల్ని అరాచకాలకు పొమ్మనడం లేదు.. మీ నామినేషన్ మీరు వెయ్యండి. న్యాయంగా నామినేషన్ వెయ్యండి. నామినేషన్ వెయ్యకుండా రాజకీయం చేయలేం. నాతో 20 మందికి పైగా టీడీపీ నేతలు మాట్లాడారు. పక్క రాష్ట్రాల నుంచి రౌడీలను తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు.

వాళ్లకు సత్తా ఉంటే ఎలక్షన్లో గెలిపించుకోమనండి. నాతో దాదాపు 20 మంది టీడీపీ నాయకులు మాట్లాడారు. బయట ఊరి వాళ్లను తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు. అధికారం లేనప్పుడు ఒక్కడు అడ్రస్ ఉండదు. రాష్ట్రంలో కూడా ఉండరు.. పారిపోతారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొందాం. ఎవరికీ ఏమీ జరగకుండా నేను బాధ్యత తీసుకుంటాను’’ అని తెలిపారు.

ఇదీ చదవండి: పయ్యావులకు ఎందుకంత భయం?: విశ్వేశ్వరరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement