పయ్యావులకు ఎందుకంత భయం?: విశ్వేశ్వరరెడ్డి | Y Visweswara Reddy Fires On Chandrababu And Payyavula Keshav | Sakshi
Sakshi News home page

పయ్యావులకు ఎందుకంత భయం?: విశ్వేశ్వరరెడ్డి

Oct 20 2026 1:45 PM | Updated on Oct 20 2026 1:45 PM

Y Visweswara Reddy Fires On Chandrababu And Payyavula Keshav

సాక్షి, అనంతపురం: చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యం.. అందుకే దౌర్జన్యం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దసరా పండగ వేళ.. వైఎస్సార్‌సీపీ నేతలను వేధించేందుకు ఉరవకొండ పోలీసులకు సిగ్గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఉరవకొండ నియోజకవర్గం పోలీసుల వేధింపులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. కేంద్ర బలగాలతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఉరవకొండ, కూడేరు సీఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. ఓడిపోతే మంత్రి పదవులు పోతాయని చంద్రబాబు హెచ్చరించారా?. చంద్రబాబు హెచ్చరించడంతో మంత్రులు హింసకు పాల్పడుతున్నారా?.

..అభివృద్ధి చేస్తే ఎన్నికలు పారదర్శకంగా జరపడానికి మీకు భయం ఎందుకు?. వైఎస్సార్‌సీపీ నేతలను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి బూతులు తిడుతున్నారు. రాష్ట్రమంతా ఫ్యాక్షన్‌కు ఆజ్యంపోసే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారు. స్వేచ్ఛగా, పారదర్శకంగా  ఎన్నికలు జరపడానికి పయ్యావులకు ఎందుకు భయం’’ అంటూ విశ్వేశ్వరరెడ్డి నిలదీశారు.

ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ నేతను లాక్కెళ్లి..

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement