ఎన్నికల అధికారికి ఆర్కే రోజా ఫిర్యాదు | RK Roja lodges complaint with Election Officer | Sakshi
Sakshi News home page

ఎన్నికల అధికారికి ఆర్కే రోజా ఫిర్యాదు

Oct 20 2026 5:25 PM | Updated on Oct 20 2026 5:38 PM

RK Roja lodges complaint with Election Officer

చిత్తూరు జిల్లా: జడ్పీ కార్యాలయంలో  జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సుమిత్ కుమార్‌ను మాజీ మంత్రి ఆర్కే రోజా కలిశారు. నగరి మున్సిపల్ చైర్మన్ ఏకగ్రీవంగా ప్రకటించడంపై ఫిర్యాదు చేశారు. నగరి మున్సిపాలిటీ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్, ఆర‍్వోపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. అలాగే, సస్పెండ్ చేయాలని కోరారు. బాలకృష్ణన్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కాపీను కలెక్టర్‌కు అందజేశారు. నగరి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫార్మ్ 4లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేరు చేర్చాలని, ఎన్నికలు జరపాలని రోజా కోరారు. 

హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ
నగరి ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి బాలకృష్ణన్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత నామినేషన్ ను ఆమోదిస్తూ లిఖిత పూర్వకంగా డిక్లరేషన్ ఇచ్చిన రిటర్నింగ్ అధికారి... అనంతరం టీడీపీ అభ్యర్థి చైర్మన్‌గా ఏకగ్రీవం అయినట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రోజా కూడా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

 ఇదీ చదవండి: రౌడీలను తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు: ఎంపీ మిథున్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement