నామినేషన్లను అడ్డుకునే కుట్ర.. మనుషులు కావాలట! | Audio Went Viral: TDPs conspiracies to block nominations | Sakshi
Sakshi News home page

నామినేషన్లను అడ్డుకునే కుట్ర.. మనుషులు కావాలట!

Oct 20 2026 9:44 PM | Updated on Oct 20 2026 9:57 PM

Audio Went Viral: TDPs conspiracies to block nominations

తిరుపతి:   స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లను అడ్డుకునేందుకు స్టూడెంట్స్‌కు గాలం వేసి వారిని ఉసిగొల్పేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోంది. ‘స్థానిక’ నామినేషన్లను అడ్డుకునేందుకు ఇప్పటివరకూ అరాచకాలు సృష్టించిన టీడీపీ.. ఇప్పుడు విద్యార్థులను ఎర వేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ‘‘నామినేషన్లు అడ్డుకునేందుకు మనుషులు కావాలట’’ అనే ఆడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడమే ఇందుకు ఉదాహరణ.

ఆడియోలో ఉన్న దాని ప్రకారం.. తిరుపతిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లను అడ్డుకునేందుకు కొంతమంది మనుషులు కావాలని.. తనకు టీడీపీకి చెందిన ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి చెప్పాడని ఓ ఎస్పీయూ స్టూడింట్‌ తెలిపాడు. కొంతమంది విద్యార్థులు నామినేషన్ల అడ్డుకునే దాంట్లో పాల్గొంటే, మనిషికి రూ. 600 ఇస్తారట. ఒక బిర్యానీ ప్యాకెట్‌ కూడా  ఇస్తారని తన ఫ్రెండ్‌ చెప్పాడన్నాడు. కాల్‌ చేసిన ఫ్రెండ్‌ టీడీపీ వ్యక్తి అని కూడా చెప్పుకొచ్చాడు.. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘం నేత.. నేరుగా ఆ స్టూడెంట్‌కు ఫోన్‌ చేసి అడగడమే కాకుండా క్లాస్‌ పీకాడు. అటువంటి వాటికి జోలికి పోయి కెరీర్‌ నాశనం చేసుకోవద్దని సూచించాడు. 

తమ స్వార్ద ప్రయోజనాలను మాత్రమే చూసుకునే టీడీపీ పెద్దలు.. స్టూడెంట్స్‌ ను కూడా ఈ నామినేషన్ల అడ్డుకునే ప్రక్రియలోకి లాగడం నిజంగా సిగ్గుచేటని పలువురు విమర్శిస్తున్నారు.

ఇదీ చదవండి:  ‘ప్రజాస్వామ్యంలో బ్యాలెట్లు కావాలి.. బుల్లెట్లు కాదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement