స్టాక్‌ మార్కెట్‌ సెలవులు.. ఏప్రిల్‌లో ఈ రోజుల్లో నో ట్రేడింగ్‌ | Stock market holidays BSE NSE to remain closed on THESE dates in April 2025 | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్‌ సెలవులు.. ఏప్రిల్‌లో ఈ రోజుల్లో నో ట్రేడింగ్‌

Mar 31 2025 9:53 AM | Updated on Mar 31 2025 9:56 AM

Stock market holidays BSE NSE to remain closed on THESE dates in April 2025

ఇటీవలి రోజుల్లో స్టాక్‌ మార్కెట్లపై జనంలో ఆసక్తి పెరిగింది. చాలా మంది మార్కెట్‌ పెట్టుబడుల వైపు వస్తున్నారు. దీంతో రోజువారీ ట్రేడింగ్‌ను గమనించేవారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఏయే రోజులు పనిచేస్తాయి.. సెలవులు ఎప్పుడెప్పుడు ఉంటాయన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..

ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) సందర్భంగా ఈరోజు (2025 మార్చి 31 సోమవారం) భారత స్టాక్ మార్కెట్‌కు సెలవు. మూడు రోజుల వారాంతం తర్వాత 2025 ఏప్రిల్ 1 మంగళవారం ట్రేడింగ్ పునఃప్రారంభమవుతుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) రెండూ ఈరోజు స్టాక్స్, డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ లోన్ (ఎస్ఎల్బీ) విభాగాల్లో ట్రేడింగ్, సెటిల్మెంట్‌కు తెరిచి ఉండవు.

అయితే 2025 మార్చి 31న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)  మాత్రం పాక్షికంగా తెరిచి ఉంటుంది. సాయంత్రం సెషన్ సాయంత్రం 5 గంటల నుండి 11:30 / 11:55 గంటల వరకు నడుస్తుంది. దీనికి విరుద్ధంగా, భారతదేశపు అతిపెద్ద వ్యవసాయ కమోడిటీ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌సీడీఈఎక్స్) ఈరోజు పూర్తిగా 
మూసి ఉంటుంది.

ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్ సెలవులు
పండుగలు, విశేష దినోత్సవాలు, వారాంతపు సెలవులతో కలుపుకొని ఏప్రిల్ నెలలో స్టాక్‌ మార్కెట్లు మొత్తంగా 11 రోజులు మూసిఉంటాయి.  ఆయా రోజుల్లో స్టాక్‌ ఎక్స్చేంజీలు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉండవు. సెలవు రోజులు ఇవే..

అదనపు సెలవులు
ఏప్రిల్ 10 - మహావీర్ జయంతి
ఏప్రిల్ - 14 - డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 18 - గుడ్ ఫ్రైడే

వారాంతపు సెలవులు
ఏప్రిల్ 5 - శనివారం
ఏప్రిల్ 6 - ఆదివారం
ఏప్రిల్ 12 - శనివారం
ఏప్రిల్ 13 - ఆదివారం
ఏప్రిల్ 19 - శనివారం
ఏప్రిల్ 20 - ఆదివారం
ఏప్రిల్ 26 - శనివారం
ఏప్రిల్ 27 - ఆదివారం

Advertisement
 
Advertisement
Advertisement