శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 879.09 పాయింట్లు లేదా 1.23 శాతం లాభంతో 72,472.33 వద్ద, నిఫ్టీ 288.65 పాయింట్లు లేదా 1.30 శాతం లాభంతో 22,520.45 వద్ద నిలిచాయి.
సైయంట్ లిమిటెడ్, కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్, పైన్ ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఇదీ చదవండి: భారత్ స్టార్‌లింక్ పంచాయితీలో బిగ్ ట్విస్ట్!


