లాభాలతో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్‌ హ్యాట్రిక్‌ | Stock Market Close Highlights January 16 2025 Sensex up for third day banks shine | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్‌ హ్యాట్రిక్‌

Jan 16 2025 3:55 PM | Updated on Jan 16 2025 3:55 PM

Stock Market Close Highlights January 16 2025 Sensex up for third day banks shine

దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ (BSE) సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ (NSE) నిఫ్టీ 50 గురువారం వరుసగా మూడవ సెషన్‌లో సానుకూలంగా ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 318.74 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 77,042.82 వద్ద స్థిరపడింది. ఈ రోజు ఈ ఇండెక్స్ 77,319.50 నుండి 76,895.51 రేంజ్‌లో ట్రేడ్ అయింది.

ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 98.60 పాయింట్లు లేదా 0.42 శాతం లాభంతో 23,311.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,391.65కి చేరుకోగా, కనిష్ట స్థాయి 23,272.05 వద్ద నమోదైంది. 

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ లైఫ్ , అదానీ పోర్ట్స్ ఈరోజు టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. వీటి లాభాలు 7.99 శాతం వరకు పెరగడంతో నిఫ్టీ50లోని 50 స్టాక్‌లలో 33 గ్రీన్‌లో ముగిశాయి.

మరోవైపు ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్, హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ నేతృత్వంలోని 17 భాగస్వామ్య స్టాక్‌లు 2.90 శాతం వరకు క్షీణించి నష్టాల్లో ముగిశాయి.

నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు 1 శాతంపైగా పెరగడంతో విస్తృత మార్కెట్లు బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. ఇదిలా ఉండగా, మార్కెట్ అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ 1.35 శాతం పెరిగి 15.17 పాయింట్ల వద్ద ముగిసింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement