హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టూడెంట్ హౌసింగ్ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ స్టారెజ్ తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో విస్తరించింది. తాజాగా గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌ని ప్రారంభించింది. ఏఐ, డేటా ఇంటెలిజెన్స్ ధారిత ఆవిష్కరణలపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతుందని సంస్థ చైర్మన్ ట్రావిస్ నైప్ తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం 40కి పైగా ఉన్న తమ సిబ్బంది సంఖ్యను 200 పైచిలుకు పెంచుకోనున్నట్లు వివరించారు. ఆ్రస్టేలియా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టారెజ్.. అమెరికా, కెనడా తదితర దేశాల్లో 1,100 పైగా సంస్థలకు సేవలు అందిస్తోంది.


