రూ.3 లక్షలతో బుకింగ్.. 50 యూనిట్లు మాత్రమే! | Skoda Kodiaq RS Bookings Opened Will be Limited to 50 Units Only | Sakshi
Sakshi News home page

రూ.3 లక్షలతో బుకింగ్.. 50 యూనిట్లు మాత్రమే!

Jun 22 2026 3:02 PM | Updated on Jun 22 2026 3:24 PM

Skoda Kodiaq RS Bookings Opened Will be Limited to 50 Units Only

స్కోడా కంపెనీ తన సరికొత్త కొడియాక్ ఆర్ఎస్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ.3 లక్షల టోకెన్ మొత్తంతో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అయితే సంస్థ 50 యూనిట్లను మాత్రమే డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. ఆర్ఎస్ బ్యాడ్జ్ 50 సంవత్సరాల వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకుని స్కోడా ఈ కారును మార్కెట్లో లాంచ్ చేసింది.

సరికొత్త స్కోడా కొడియాక్ ఆర్ఎస్ విండో ట్రిమ్స్, రూఫ్ రైల్స్ వంటివి పొందుతుంది. ఇది మూన్ వైట్, మ్యాజిక్ బ్లాక్, వెల్వెట్ రెడ్, స్టీల్ గ్రే అనే రంగులలో లభిస్తుంది. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇందులో ఎకో, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్, ఇండివిడ్యువల్, స్నో అనే డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 2.0 TSI పెట్రోల్ ఇంజిన్‌ ద్వారా పనిచేస్తుంది. ఇంజిన్ 265 bhp పవర్, 400 Nm టార్క్ అందిస్తుంది. ఇది 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా శక్తి నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 231 కిమీ/గం. కాబట్టి ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement