క్రెడిట్‌ కార్డుపై మోసపోతే 5 రోజుల్లో వెనక్కి! | RBI New Guidelines For Unauthorised Transactions | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ కార్డుపై మోసపోతే 5 రోజుల్లో వెనక్కి!

Jun 25 2026 4:57 AM | Updated on Jun 25 2026 4:57 AM

RBI New Guidelines For Unauthorised Transactions

రూ. 500 మించితే తక్షణ ఎస్‌ఎంఎస్‌ 

బ్యాంక్‌లకు ఆర్‌బీఐ మార్గదర్శకాలు 

ముంబై: ఎల్రక్టానిక్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలను (ఈబీటీ) మరింత సురక్షితంగా మార్చేందుకు ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డు ద్వారా లావాదేవీల్లో మోసపోతే కస్టమర్‌కు ఐదు రోజుల్లోనే ఆ మొత్తాన్ని షాడో రివర్స్‌ (తాత్కాలికంగా జమ) చేయాలన్న నిబంధనను తీసుకొచ్చింది. 

రూ.500 మించిన ప్రతి లావాదేవీ వివరాలను వెంటనే కస్టమర్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేయడం తప్పనిసరి. రూ.500లోపు లావాదేవీలకు సైతం ఎస్‌ఎంఎస్‌ ఇవ్వాలా? వద్దా అన్నది బ్యాంకుల అభీష్టానికి విడిచిపెట్టింది. ఒకవేళ రూ.500లోపు లావాదేవీలను కూడా ఎస్‌ఎంఎస్‌ రూపంలో తెలియజేసేట్టు అయితే అందుకు చార్జీ వసూలు చేయరాదని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.  

→ మోసపూరిత ఈబీటీపై కస్టమర్‌ నుంచి ఫిర్యాదు రాగానే, ఆ ఖాతా నుంచి తదుపరి మోసపూరిత లావా దేవీలు జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. 

→ బ్యాంక్‌ వ్యవస్థలో లోపాలు, నిర్లక్ష్యం కారణంగా మోసపూరిత ఈబీటీ చోటు చేసుకుంటే అందుకు కస్టమర్‌పై ఎలాంటి బాధ్యత ఉండదు. ఆ మొత్తాన్ని కస్టమర్‌కు వెనక్కిచ్చేయాల్సిందే. 

→ మూడో పక్షం ఉల్లంఘన వల్ల మోసపూరిత లావాదేవీ చోటు చేసుకుంటే, దీనిపై 5 రోజుల్లో బ్యాంక్‌కు తెలియజేస్తే, కస్టమర్‌ బాధ్యత ఏమీ ఉండదు. ఆ తర్వాత నివేదిస్తే బ్యాంక్‌ విధానం మేరకు కస్టమర్‌ బాధ్యతను నిర్ణయించొచ్చు.  

→ క్రెడిట్‌ కార్డు, యూపీఐ లావాదేవీలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్, డెబిట్‌ కార్డ్‌ లావాదేవీలు, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్‌టీ జీఎస్‌ లావాదేవీలన్నీ ఈబీటీ కిందకే వస్తాయి.  

→ షాడో రివర్సల్‌ అంటే.. మోసపూరిత లావాదేవీ మొత్తానికి తాత్కాలిక జమ. సంబంధిత మోసంపై దర్యాప్తు పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు ఆ లావాదేవీ మొత్తాన్ని కస్టమర్‌పై బాధ్యతగా చూపించకుండా ఈ నిబంధన వెసులుబాటునిస్తుంది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement