దేశీయంగా డిమాండు, పుంజుకున్న పారిశ్రామిక కార్యకలాపాల దన్నుతో గ్లోబల్ సవాళ్లను భారత ఎకానమీ మెరుగ్గా ఎదుర్కొనగలిగిందని రిజర్వ్ బ్యాంక్ తాజా ఆగస్టు బులెటిన్‌లో వెల్లడించింది. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ దేశ పరిస్థితి ఆశావహంగానే కనిపిస్తోందని పేర్కొంది. చైనా, ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే అమెరికా మనపై మరో 10 శాతం టారిఫ్‌లు అధికంగా విధించినప్పటికీ ఆ ప్రభావం పెద్దగా ఉండబోదని వివరించింది.
అగ్రరాజ్యానికి అత్యధికంగా ఎగుమతి చేసే స్మార్ట్‌ఫోన్లు, పెట్రోలియం ఉత్పత్తులు, ఫార్మా మొదలైన వాటికి ఇవి వర్తించవని ఆర్‌బీఐ తెలిపింది. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే జూన్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రాక గణనీయంగా పెరిగిందని పేర్కొంది. ఈక్విటీల్లోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో సింగపూర్, నెదర్లాండ్స్, అమెరికా, కెనడా వాటా 74 శాతంగా ఉన్నట్లు వివరించింది.
ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా..


