మార్కెట్‌ భద్రత కోసం సెబీ బిగ్‌ స్టెప్‌! | SEBI Cyber Suraksha Portal Game-Changing Cyber Security Hub Indian Stock Market | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ భద్రత కోసం సెబీ బిగ్‌ స్టెప్‌!

Aug 26 2026 7:40 PM | Updated on Aug 26 2026 8:21 PM

SEBI Cyber Suraksha Portal Game-Changing Cyber Security Hub Indian Stock Market

సెక్యూరిటీల మార్కెట్‌లో సైబర్‌ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం ‘సైబర్‌ సురక్ష పోర్టల్‌’ను ప్రారంభించింది. సైబర్‌ భద్రతకు సంబంధించిన సర్క్యులర్లు, వ్యవస్థల్లోని భద్రతా లోపాలపై హెచ్చరికలు, సైబర్‌ ఘటనలకు సంబంధించిన విశ్లేషణలను ఒకేచోట అందించే వన్‌–స్టాప్‌ హబ్‌గా ఇది పనిచేస్తుందని సెబీ తెలిపింది.

‘‘సెక్యూరిటీల మార్కెట్‌లో సైబర్‌ భద్రతకు సంబంధించిన కీలక పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని పంచుకోవడానికి ఈ వేదిక సమగ్ర, కేంద్రీకృత కేంద్రంగా ఉపయోగపడుతుంది’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పోర్టల్‌ ద్వారా మార్కెట్‌ భాగస్వాములు తాజా సైబర్‌ భద్రతా సర్క్యులర్లు, భద్రతా లోపాలపై హెచ్చరికలు, సైబర్‌ ఘటనలకు సంబంధించిన వివరాలను నేరుగా పొందవచ్చని సెబీ తెలిపింది.

ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement