న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ముద్రా యోజన, స్టాండప్ ఇండియా సహా ఆర్థిక సమ్మిళితత్వానికి సంబంధించిన ప్రభుత్వ పథకాల్లో మరింతగా పాలుపంచుకోవాలని ప్రైవేట్ బ్యాంకులకు ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ లోహియా సూచించారు. ఇందుకు సంబంధించి అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకుల చీఫ్‌లతో భేటీ సందర్భంగా ఆయన ఈ విషాలు తెలిపారు. అణగారిన వర్గాల ప్రజలకు సేవలందించడంపైనా, వారి బ్యాంకింగ్ అవసరాలను తీర్చడంపైనా మరింతగా దృష్టి పెట్టాలని ప్రైవేట్ బ్యాంకులను ఆయన కోరారు. భేటీ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల పురోగతిని సమీక్షించినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి: యువత ఆర్థిక స్వేచ్ఛకు.. ఎన్‌పీఎస్


