డిపాజిట్లలో ప్రైవేట్‌ బ్యాంకుల జోరు | Private Banks Outpace PSU Banks Deposit Growth RBL Bank Leads | Sakshi
Sakshi News home page

డిపాజిట్లలో ప్రైవేట్‌ బ్యాంకుల జోరు

Oct 7 2026 9:59 PM | Updated on Oct 7 2026 10:02 PM

Private Banks Outpace PSU Banks Deposit Growth RBL Bank Leads

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను మించి ప్రైవేట్‌ బ్యాంకులు డిపాజిట్లను సమీకరించాయి. జూలై–సెపె్టంబర్‌ వ్యవధికి గాను బ్యాంకులు వెల్లడించిన ప్రొవిజనల్‌ గణాంకాల ప్రకారం ప్రైవేట్‌ బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి 17–34 శాతం స్థాయిలో ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇది 6.87–17.01 శాతంగా నమోదైంది.

ప్రైవేట్‌ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 18.8 శాతం, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 23.2 శాతం, యస్‌ బ్యాంక్‌ 19.5 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 20.7 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 17 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 34 శాతం మేర డిపాజిట్ల వృద్ధిని సాధించాయి. ప్రభుత్వ రంగంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా దేశీ డిపాజిట్లలో 17.01 శాతం, గ్లోబల్‌ డిపాజిట్లలో 16.75 శాతం వృద్ధి సాధించింది.

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (14.43 శాతం), యూకో బ్యాంక్‌ (14.05 శాతం), పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ (12.98 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బి) డిపాజిట్లు ఏకంగా 133 బిలియన్‌ డాలర్ల పైగా రావడమనేది డిపాజిట్ల వృద్ధికి దోహదపడినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement