స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. జూలైలో 8 రోజుల సెలవు! | NSE BSE To Remain Closed For Eight Days In July 2026 Check Full List | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. జూలైలో 8 రోజుల సెలవు!

Jun 30 2026 8:08 PM | Updated on Jun 30 2026 8:14 PM

NSE BSE To Remain Closed For Eight Days In July 2026 Check Full List

జూలై నెలలో మొత్తం 8 రోజులు స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇవి సాధారణ వారాంతపు సెలవులు మాత్రమే. ఇందులో 4 శనివారాలు, 4 ఆదివారాలు ఉన్నాయి. తేదీల ప్రకారం చూస్తే జూలై 4, 11, 18, 25 శనివారాలు కాగా, జూలై 5, 12, 19, 26 ఆదివారాలు మార్కెట్ సెలవులు అవుతాయి.

సాధారణ వారాంతపు సెలవుల కారణంగా ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ క్లోజ్ అవుతాయి. కాబట్టి జూలై 2026లో తమ ట్రేడింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకుంటున్న పెట్టుబడిదారులు ఈ నెలలో వారపు రోజులలో స్టాక్ మార్కెట్ సెలవులు లేవని గమనించాలి. ఎందుకంటే.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) రెండూ అన్ని ట్రేడింగ్ రోజులలో యధావిధిగా పనిచేస్తాయి.

ఎన్‌ఎస్‌ఈ క్యాలెండర్ ప్రకారం.. 2026లో తదుపరి వర్కింగ్ డే సెలవు సెప్టెంబర్ 14న వస్తుంది. ఆ రోజు గణేష్ చతుర్థి కారణంగా మార్కెట్ క్లోజ్.

2026 సంవత్సరంలో మొత్తం 16 వర్కింగ్ డే సెలవులు షేర్ మార్కెట్‌కు ఉన్నాయి. రాబోయే నెలల్లో వివిధ జాతీయ, మతపరమైన పండుగల కారణంగా ట్రేడింగ్ ఉండదు. అవి..

  • అక్టోబర్ 2: గాంధీ జయంతి

  • అక్టోబర్ 20: దసరా

  • నవంబర్ 10: దీపావళి

  • నవంబర్ 24: శ్రీ గురు నానక్ జయంతి

  • డిసెంబర్ 25: క్రిస్మస్

కొన్ని ముఖ్యమైన పండుగలు వారాంతాల్లో రావడంతో అదనపు సెలవులు ఉండవు. ఉదాహరణకు, ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం) శనివారం కావడం వల్ల అదనపు ట్రేడింగ్ సెలవుగా ఉండదు. అలాగే దీపావళి లక్ష్మీ పూజ కూడా ఆదివారం రావడం వల్ల సాధారణ సెలవు ఉండదు. అయితే ఆ రోజున ప్రత్యేకంగా ముహూర్త ట్రేడింగ్ సెషన్ నిర్వహించే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement