వాటి మార్జిన్లపై ప్రభావం ఉండదు
ఫిచ్ రేటింగ్స్ అంచనాలు
న్యూఢిల్లీ: రష్యన్ ఆయిల్ కంపెనీలైన రోజ్‌నెఫ్ట్, ల్యూక్ ఆయిల్‌పై అమెరికా ఆంక్షలు విధించడం, రష్యా చమురు ఆధారిత రిఫైనరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య (ఈయూ) నిషేధం విధించడం భారత ప్రభుత్వరంగ చమురు సంస్థల మార్జిన్లు, పరపతి సామర్థ్యాలపై పెద్దగా ప్రభావం ఉండదని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. అయితే, ఈ ఆంక్షలు ఎంత కాలం పాటు కొనసాగుతాయి, ఎంత కఠినంగా అవి అమలవుతాయన్న దాని ఆధారంగా తుది ప్రభావం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. 2025 జనవరి నుంచి ఆగస్ట్ మధ్య కాలంలో భారత చమురు దిగుమతుల్లో మూడింట ఒక వంతు రష్యా నుంచే ఉండడం గమనార్హం.
రష్యా డిస్కౌంట్ రేటుపై చమురును విక్రయించడంతో ప్రభుత్వరంగ చమురు సంస్థల లాభదాయకత గణనీయంగా మెరుగుపడింది. సాధారణంగా మధ్యప్రాచ్య దేశాలపై చమురు దిగుమతుల కోసం భారత్ ఎక్కువగా ఆధారపడేది. కానీ, 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన తర్వాత ఈ పరిస్థితుల్లో చాలా మార్పు వచి్చంది. పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో మార్కెట్ ధర కంటే తక్కువకే చమురును రష్యా ఆఫర్ చేయడంతో భారత కంపెనీలు అటువైపు మళ్లాయి. దీంతో భారత చమురు దిగుమతుల్లో అంతకుముందు రష్యా వాటా ఒక శాతంగా ఉంటే, 40 శాతానికి పెరిగింది.
చమురు ధరలు తక్కువ స్థాయిలోనే..
ప్రపంచ చమురు ఉత్పత్తి సామర్థ్యం తగినంత ఉండడం ధరలను అదుపులోనే ఉంచుతుందని, బ్రెంట్ బ్యారెల్ ధర 2026లో సగటున 65 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని ఫిచ్ రేటింగ్స్ తెలిపంది. 2025లో బ్రెంట్ బ్యారెల్ 70 డాలర్లుగా ఉండడాన్ని ప్రస్తావించింది. ఇక రష్యా చమురు ఆధారిత ఉత్పత్తులను ఈయూకి ఎక్కువగా ఎగుమతి చేస్తున్న భారత్‌లోని ప్రైవేటు చమురు సంస్థలు రిస్‌్కను ఎదుర్కోవాల్సి రావొచ్చని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. మూడు ప్రభుత్వరంగ చమురు సంస్థల (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీ) ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్‌లు బలంగా ఉన్నట్టు తెలిపింది. ఎల్‌పీబీ సబ్సిడీల నష్టాన్ని ప్రభుత్వం ప్రకటించిన రూ.30వేల కోట్ల ప్యాకేజీతో గట్టెక్కొచ్చని పేర్కొంది. స్థూల రిఫైనింగ్ మార్జిన్ 2025–26లో బ్యారెల్‌కు 6–7 డాలర్లు, 2026–27లో 6 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది.


