ఎకానమీకి గణాంకాల ఊరట, దేశంలో గరిష్టానికి చేరిన రీటైల్‌ ద్రవ్యోల్బణం | India Retail Inflation Surges To 4.81 Percent In June | Sakshi
Sakshi News home page

ఎకానమీకి గణాంకాల ఊరట, దేశంలో గరిష్టానికి చేరిన రీటైల్‌ ద్రవ్యోల్బణం

Jul 13 2023 9:38 AM | Updated on Jul 13 2023 10:54 AM

India Retail Inflation Surges To 4.81 Percent In June - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బుధవారం వెలువడిన గణాంకాలు ఎకానమీకి కొంత ఊరటనిచ్చాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం  జూన్‌ నెల్లో మూడు నెలల గరిష్ట స్థాయిలో 4.81 శాతంగా నమోదవగా, మే నెల పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 5.2 శాతం పురోగతి నెలకొంది.

తయారీ, మైనింగ్‌ రంగాలు మంచి పనితీరును ప్రదర్శించాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం జూన్‌ నెల్లో మూడు నెలల గరిష్ట స్థాయిని చూసినా, అది ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయిలోనే ఉండడం ఊరట నిస్తున్న అంశం.

అన్ని విభాగాలూ పురోగతిలోనే... 

మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం 5.7 శాతం వృద్ధిని (గత ఆర్థిక సంవత్సరం ఇదే నెల విలువతో పోల్చి) నమోదుచేసుకుంది. 

విద్యుత్‌ ఉత్పత్తి 0.9% వృద్ధి నమోదయ్యింది.  

మైనింగ్‌లో 6.4 శాతం పురోగతి ఉంది.  

క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో 8.2 శాతం వృద్ధి. 

కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ ఉత్పత్తిలో 1.1% వృద్ధి.  

మౌలిక, నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 14%.  

ఏప్రిల్‌– మే నెలల్లో... 
ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 4.8 శాతం వృద్ధి నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలల్లో ఈ రేటు 12.9 శాతంగా నమోదయ్యింది. 

అమెరికన్‌లకు ఊరట
మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణం కట్టడి అక్కడి ప్రజలకు భారీ ఊరట కల్పించింది. లేబర్ డిపార్ట్‌మెంట్ జూన్‌లో వార్షిక ప్రాతిపదికన వినియోగదారుల ధరల సూచిక 3 శాతం పెరిగింది. మేలో 4శాతం వార్షిక లాభం నుండి తగ్గింది. నెలవారీ ప్రాతిపదికన సీపీఐ ద్రవ్యోల్బణం 0.2 శాతం లాభపడింది.

తాజాగా, సీపీఐ డేటా ఫెడరల్ రిజర్వ్ రేట్ పెంపుదల చివరకు ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పట్టింది.. సంవత్సరానికి పైగా సీపీఐ ద్రవ్యోల్బణం జూన్ 2022లో 9.1% శాతం 40 సంవత్సరాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఇది ఇప్పుడు వరుసగా 12 నెలలు పడిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement