breaking news
India Inflation Data
-
ఎకానమీకి గణాంకాల ఊరట, దేశంలో గరిష్టానికి చేరిన రీటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బుధవారం వెలువడిన గణాంకాలు ఎకానమీకి కొంత ఊరటనిచ్చాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెల్లో మూడు నెలల గరిష్ట స్థాయిలో 4.81 శాతంగా నమోదవగా, మే నెల పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 5.2 శాతం పురోగతి నెలకొంది. తయారీ, మైనింగ్ రంగాలు మంచి పనితీరును ప్రదర్శించాయి. రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెల్లో మూడు నెలల గరిష్ట స్థాయిని చూసినా, అది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయిలోనే ఉండడం ఊరట నిస్తున్న అంశం. అన్ని విభాగాలూ పురోగతిలోనే... మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం 5.7 శాతం వృద్ధిని (గత ఆర్థిక సంవత్సరం ఇదే నెల విలువతో పోల్చి) నమోదుచేసుకుంది. ♦ విద్యుత్ ఉత్పత్తి 0.9% వృద్ధి నమోదయ్యింది. ♦ మైనింగ్‌లో 6.4 శాతం పురోగతి ఉంది. ♦ క్యాపిటల్ గూడ్స్ విభాగంలో 8.2 శాతం వృద్ధి. ♦కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తిలో 1.1% వృద్ధి. ♦ మౌలిక, నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 14%. ఏప్రిల్– మే నెలల్లో... ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 4.8 శాతం వృద్ధి నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలల్లో ఈ రేటు 12.9 శాతంగా నమోదయ్యింది. అమెరికన్లకు ఊరట మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణం కట్టడి అక్కడి ప్రజలకు భారీ ఊరట కల్పించింది. లేబర్ డిపార్ట్మెంట్ జూన్‌లో వార్షిక ప్రాతిపదికన వినియోగదారుల ధరల సూచిక 3 శాతం పెరిగింది. మేలో 4శాతం వార్షిక లాభం నుండి తగ్గింది. నెలవారీ ప్రాతిపదికన సీపీఐ ద్రవ్యోల్బణం 0.2 శాతం లాభపడింది. తాజాగా, సీపీఐ డేటా ఫెడరల్ రిజర్వ్ రేట్ పెంపుదల చివరకు ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పట్టింది.. సంవత్సరానికి పైగా సీపీఐ ద్రవ్యోల్బణం జూన్ 2022లో 9.1% శాతం 40 సంవత్సరాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఇది ఇప్పుడు వరుసగా 12 నెలలు పడిపోయింది. -
మూడేళ్ల గరిష్టంలో టోకు ధరల ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : దేశీయ టోకు ధరల ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్టానికి ఎగిసింది. అంచనావేసిన దానికంటే పెరిగి ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణం ఏడాది ఏడాదికి 6.55 శాతంగా నమోదైంది. జనవరి నెలలో ఈ ద్రవ్యోల్బణం 5.25 శాతంగా ఉంది. మినరల్స్, ప్యూయల్ ధరలు పెరగడంతో పాటు ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో ఈ టోకు ధరల ద్రవ్యోల్బణం పెరిగినట్టు ప్రభుత్వ డేటా పేర్కొంది. మంగళవారం ప్రభుత్వం ఈ డేటాను విడుదల చేసింది. రాయిటర్స్ పోల్స్ అంచనాల ప్రకారం ఈ డేటా 5.90 శాతంగా నమోదవుతుందని అంచనావేసింది. ఈ రెండున్నర ఏళ్లలో టోకు ధరలు భారీగా పెరిగినట్టు తెలిసింది. గత నెల టోకు విక్రయాల ఆహార ధరలు యేటికేటికి 2.69 శాతం పెరిగాయి. జనవరిలో ఇవి 0.56 శాతం పడిపోయాయి. మినరల్ ధరలు కూడా 31 శాతం పెరిగాయి. అంతేకాక సమీక్షించిన పెట్రోల్, డీజిల్ ధరలు పైకి ఎగియడంతో ప్యూయల్ 21 శాతం కాస్ట్ లీగా మారిందని ప్రభుత్వ డేటా వెల్లడించింది.