ఎగుమతులు జూమ్‌! | India June exports shine through West Asia dark clouds | Sakshi
Sakshi News home page

ఎగుమతులు జూమ్‌!

Jul 14 2026 5:37 AM | Updated on Jul 14 2026 5:37 AM

India June exports shine through West Asia dark clouds

జూన్‌లో 15 శాతం వృద్ధి; 

40.41 బిలియన్‌ డాలర్లు 

ఐదు నెలల గరిష్టానికి వాణిజ్య లోటు

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌లో ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 15.5 శాతం పెరిగి 40.41 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అదే సమయంలో దిగుమతులు 31% వృద్ధితో 70.84 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి.  క్రూడాయిల్‌ అధిక రేట్ల కారణంగా దిగుమతుల భారం పెరగడంతో వాణిజ్య లోటు 5 నెలల గరిష్టమైన 30.43 బిలియన్‌ డాలర్లకు చేరింది. విలువైన లోహాలు, ఎలక్ట్రానిక్స్, మెషినరీ మొదలైనవి దిగుమతులు భారీగా పెరగడానికి కారణమయ్యాయి. 

జూన్‌లో క్రూడ్‌ దిగుమతులు 40% ఎగిసి 19.32 బి.డాలర్లుగా నమోదయ్యాయి. గత నెల ప్రథమార్ధంలో బ్యారెల్‌కి 90 డాలర్లుగా ఉన్న క్రూడ్‌ రేట్లు ప్రస్తుతం 80 డాలర్లకు దిగొచ్చాయి. ఎల్రక్టానిక్స్, ముడి ఇనుము, హస్తకళలు, మాంసం, డెయిరీ ఉత్పత్తుల్లో ఎగుమతుల వృద్ధి సానుకూలంగా ఉన్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. 2025 జూన్‌లో వాణిజ్య లోటు 19.1 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. సర్వీసుల  ఎగుమతులు జూన్‌లో 33.03 బిలియన్‌ డాలర్లుగా, దిగుమతులు 17.92 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  

మరిన్ని వివరాలు..: 
ళీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో ఎగుమతులు 15.92 శాతం పెరిగి 129.32 బిలియన్‌ డాలర్లకు చేరింది. దిగుమతులు 19.89 శాతం వృద్ధి చెంది 216.18 బిలియన్‌ డాలర్లకు చేరాయి. పసిడి దిగుమతులు 7.49 బిలియన్‌ డాలర్ల నుంచి 11.01 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 
ళీ పశి్చమాసియాలో ఉద్రిక్తతలతో అక్కడి దేశాలకు ఏప్రిల్, మే నెలలో ఎగుమతులు తగ్గినప్పటికీ జూన్‌లో 7.29% వృద్ధి చెంది 5 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  
ళీ జూన్‌లో అమెరికాకు ఎగుమతులు 1.21% క్షీణించి 8.17 బిలియన్‌ డాలర్లకు నెమ్మదించాయి. అదే సమయంలో దిగుమతులు 33.86 శాతం పెరిగి 5.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2025 జూన్‌లో ఎగుమతులు 8.27 బిలియన్‌ డాలర్లుగా, దిగుమతులు 4.11 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  చైనాకు ఎగుమతులు 31% వృద్ధితో 1.8 బిలియన్‌ డాలర్లకు చేరాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement