12 కోట్లు దాటిన క్రెడిట్ కార్డులు.. | India's Active Credit Cards Cross 120 Million Mark In 2026, Driven By Digital Payment Growth, Check More Details Inside | Sakshi
Sakshi News home page

12 కోట్లు దాటిన క్రెడిట్ కార్డులు..

Jun 26 2026 8:47 AM | Updated on Jun 26 2026 9:55 AM

India 12 Crore Active Credit Cards Monthly Spending Rs 2 02 Lakh Crore may 2026

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల వినియోగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో క్రెడిట్‌ కార్డుల సంఖ్య మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2026 మే నాటికి దేశంలో క్రియాశీల (యాక్టివ్‌) క్రెడిట్‌ కార్డుల సంఖ్య 12.04 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.3 శాతం అధికం. మే నెలలోనే నికరంగా 10.17 లక్షల కొత్త క్రెడిట్‌ కార్డులు జారీ కావడం విశేషం. ఇది ఏడాది ప్రాతిపదికన 33.7 శాతం, ఏప్రిల్‌తో పోలిస్తే 26.9 శాతం పెరుగుదలను సూచిస్తోందని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి.

క్రెడిట్‌ కార్డుల వినియోగం కూడా స్థిరంగా కొనసాగుతోంది. మే నెలలో మొత్తం కార్డు లావాదేవీల విలువ రూ.2.02 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.3 శాతం అధికం. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా మార్చిలో నమోదైన రికార్డు స్థాయి రూ.2.19 లక్షల కోట్ల ఖర్చుతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉంది. ఏప్రిల్‌లో నమోదైన రూ.1.97 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం స్వల్పంగా మెరుగుదల కనిపించింది. ఒక్కో క్రెడిట్‌ కార్డుపై సగటు నెలవారీ వ్యయం రూ.16,778గా నమోదైంది.

కొత్త కార్డుల జారీలో ఎస్‌బీఐ కార్డ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో ఫెడరల్‌ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్ వంటి మధ్యస్థాయి బ్యాంకులు కూడా కార్డు జారీలో వేగంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు కొన్ని బ్యాంకులు అసురక్షిత రుణాల రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాయి.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దేశంలో డిజిటల్‌ చెల్లింపులు, ఈ-కామర్స్‌ విస్తరణతో క్రెడిట్‌ కార్డుల వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఖర్చుల వృద్ధి గతంతో పోలిస్తే కొంత మితంగా సాగుతోంది. దీంతో బ్యాంకులు మార్కెట్‌ వాటాను పెంచుకోవడమే కాకుండా, లాభదాయకతను కాపాడుకోవడం, బకాయిలు పెరగకుండా రిస్క్‌ మేనేజ్‌మెంట్‌పై మరింత దృష్టి సారిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement