నెలకు రూ.25,432 స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్‌ | Indeed report highlights a significant surge in internship in India | Sakshi
Sakshi News home page

నెలకు రూ.25,432 స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్‌

Mar 28 2025 7:52 AM | Updated on Mar 28 2025 10:34 AM

Indeed report highlights a significant surge in internship in India

మూడేళ్లలో రెట్టింపు అవకాశాలు

ఇండీడ్‌ నివేదిక

పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో యువ ప్రొఫెషనల్స్‌కు శిక్షణ కల్పించడంపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో గత మూడేళ్లలో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు రెట్టింపు అయినట్లు గ్లోబల్‌ జాబ్‌సైట్‌ ఇండీడ్‌ ఒక నివేదికలో వెల్లడించింది.

ఇండీడ్‌ తెలిపిన డేటా ప్రకారం 2022 ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి మధ్య కాలంలో దేశీయంగా ఇంటర్న్‌షిప్‌ పోస్టింగ్స్‌ 103 శాతం పెరిగినట్లు తెలిపింది. ఏఐ, డేటా అనలిటిక్స్, డిజిటలీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యక్షంగా ఉద్యోగ విధుల నిర్వహణపరమైన అనుభవాన్ని అందించడంతో పాటు ప్రతిభావంతులను గుర్తించి, వారికి ముందు నుంచే శిక్షణ కల్పించేందుకు కంపెనీలు ఇంటర్న్‌షిప్‌లను ఉపయోగించుకుంటున్నాయి.

ఇదీ చదవండి: అనిశ్చితులున్నా ఎగుమతులు మిన్న

ఇంటర్న్‌షిప్‌ సెర్చ్‌లో ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నాయి. మొత్తం సెర్చ్‌లలో వీటి వాటా వరుసగా 7.2 శాతం, 6.8 శాతం, 6.2 శాతంగా ఉంది. దేశీయంగా సగటున ఇంటర్న్‌షిప్‌ స్టైపెండ్‌ నెలకు రూ.25,432గా ఉంది. అయితే, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, గుర్గావ్‌ వంటి నగరాల్లో సంస్థలు జాతీయ సగటుకు మించి స్టైపెండ్‌లు అందిస్తున్నాయి. ఈ విషయంలో చెన్నై, కోల్‌కతా తదితర నగరాలు చివరి వరుసలో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement