ముంబై: దేశంలో ప్రజల పొదుపు నిధులను ఫైనాన్షియల్ మార్కెట్లలోకి మళ్లించేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకూర్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఆర్థిక కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు దశాబ్దాల పాటు సంస్కరణలు అవసరమని గురువారమిక్కడ జరిగిన 13వ ఎస్‌బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్స్ సదస్సు–226లో ఆమె చెప్పారు.
‘మన దేశంలో అనేక పటిష్టమైన ఆర్థిక సంస్థలు ఉన్నాయి. మార్కెట్లు విస్తృతమవుతున్నాయి. ప్రధాని మోదీ హయాంలో చేపడుతున్న సంస్కరణల దన్నుతో కంపెనీలు వ్యాపార కార్యకలాపాలు, పెట్టుబడులు సులభతరం అయ్యాయి. మన క్యాపిటల్ మార్కెట్లు గ్లోబల్ ఇన్వెస్టర్లకు మరింత పారదర్శకంగా, ఆకర్షణీయంగా మారుతున్నాయి. గిఫ్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ అనేది అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా మారడానికి పునాది వేశాయి’ అని ఠాకూర్ వ్యాఖ్యానించారు. న్యూయార్క్, లండన్ వంటి గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్లు.. రాత్రికి రాత్రి ఆ స్థాయికి చేరలేదని.. దశాబ్దాల కృషి, సంస్కరణల ఫలితమేనని కూడా ఆమె వివరించారు.
ఇదీ చదవండి: ఫోన్ రీచార్జ్‌లపై గుడ్‌న్యూస్.. చౌక ప్లాన్లు వస్తున్నాయ్!


