ఈవీ విడిభాగాల తయారీలోకి హిందాల్కో.. పుణెలో ప్లాంటు | Hindalco Enters EV Component Manufacturing Delivers to MandM | Sakshi
Sakshi News home page

ఈవీ విడిభాగాల తయారీలోకి హిందాల్కో.. పుణెలో ప్లాంటు

Apr 26 2025 1:39 PM | Updated on Apr 26 2025 1:47 PM

Hindalco Enters EV Component Manufacturing Delivers to MandM

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) విడిభాగాల తయారీ విభాగంలోకి ప్రవేశించినట్లు హిందాల్కో వెల్లడించింది. ఇందుకు సంబంధించి పుణెలోని చకాన్‌లో రూ. 500 కోట్లతో తేలికపాటి బ్యాటరీ సొల్యూషన్స్‌ ఉత్పత్తి కోసం తయారీ ప్లాంటును ప్రారంభించింది. ఎంఅండ్‌ఎం సంస్థకు 10,000 అల్యూమినియం బ్యాటరీ ఎన్‌క్లోజర్లను కూడా అందించినట్లు కంపెనీ సందర్భంగా తెలిపింది.

మహీంద్రాతో కలిసి అభివృద్ధి చేసిన ఈ బ్యాటరీ ఎన్‌క్లోజర్, సాధారణ ఉక్కు డిజైన్లతో పోలిస్తే 40 శాతం తక్కువ బరువు ఉంటుంది. వాహన రేంజి సుమారు 8–10 శాతం మెరుగుపడుతుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని దేశీయంగానే అత్యంత నాణ్యమైన అల్యూమినియం ఉత్పత్తులను తయారు చేసుకునేందుకు చకాన్‌ ప్లాంటు తోడ్పడగలదని హిందాల్కో ఇండస్ట్రీస్‌ ఎండీ సతీష్‌ పాయ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement