
కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో నిర్వహణా సంబంధ మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా రూ. 10,900 కోట్ల పీఎం ఈ–డ్రైవ్ పథకంలో భాగంగా రూ. 2,000 కోట్ల పెట్టుబడులతో 72,300 పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు తెరతీసింది. సబ్సిడీ పథకానికి అనుగుణంగా వివిధ ప్రాంతాలలో వీటి ఏర్పాటుకు నిబంధనలు ప్రకటించింది.
ప్రభుత్వ సంబంధ కార్యాలయాలు, రెసిడెన్షియల్ కాంప్లెక్సులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు తదితరాలలో ఏర్పాటు చేసే అప్‌స్ట్రీమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఈవీ చార్జింగ్ ఎక్విప్‌మెంట్‌కు 100 శాతం సబ్సిడీకి వీలుంటుంది. వీటిని ఉచితంగా పబ్లిక్ యాక్సెస్‌కు అనుగుణంగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా పీఎస్‌యూల నిర్వహణలోని నగరాలు, జాతీయ రహదారులతోపాటు.. రైల్వే స్టేషన్లు, ఏఏఐ నిర్వహణలోని ఎయిర్‌పోర్టులు, ఓఎంసీల రిటైల్ ఔట్‌లెట్లు, ఎస్‌టీయూ బస్ స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, మునిసిపల్ పార్కింగ్ లాట్లు తదితరాలలో ఏర్పాటు చేసే అప్‌స్ట్రీమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 80 శాతం, ఈవీ సరఫరా ఎక్విప్‌మెంట్ వ్యయాలలో 70 శాతం సబ్సిడీ కవర్ లభిస్తుంది.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!